టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాకి కొత్త తలనొప్పి... అవసరమైతే ఆ ఇద్దరినీ పక్కనబెట్టాలంటూ..

Published : Mar 16, 2023, 01:53 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌కి షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ప్రత్యర్థులు కూడా ఫైనల్ అయిపోయారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలబడిన ఇండియా , ఆస్ట్రేలియా... జూన్ 7న లండన్‌లోని ది ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి....

PREV
16
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాకి కొత్త తలనొప్పి... అవసరమైతే ఆ ఇద్దరినీ పక్కనబెట్టాలంటూ..

ఇంగ్లాండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుండడంతో టీమిండియాకి కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. అందులో టీమ్ కాంబినేషన్ ఒకటి. ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచుల్లో డ్యూక్ బాల్స్ వాడతారు. దీంతో స్పిన్ బౌలర్ల కంటే పేస్, స్వింగ్ బౌలర్లకే అధిక ప్రాధాన్యం దక్కుతుంది...

26

‘రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ ఫిట్‌గా ఉంటే అక్షర్ పటేల్‌ని పక్కకు తప్పించాల్సిందే. ఆ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్‌ని ఆడిస్తే బెటర్... గత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో ఆడి చాలా పెద్ద తప్పు చేసింది...

36
Image credit: Getty

ఇంగ్లాండ్ పిచ్‌ మీద ఇద్దరు స్పిన్నర్లను ఆడించడం కరెక్ట్ కాదు. ఒక్క స్పిన్ ఆల్‌రౌండర్ సరిపోతాడు. కాబట్టి రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లలో ఒకరిని తప్పించాల్సి వస్తే తప్పించక తప్పదు. అశ్విన్, జడేజాలలో ఎవరిని తప్పించాలనే ఆలోచన వస్తే... నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం...

46

జడేజా బ్యాటుతో అదరగొడుతూ, వికెట్లు కూడా తీయగలడు. స్టీవ్ స్మిత్, లబుషేన్‌లపై జడేజాకి మంచి రికార్డు ఉంది. కాబట్టి అశ్విన్ కంటే జడేజాని తుది జట్టులో ఆడించడమే కరెక్ట్ అని నా అభిప్రాయం... ఈ ఇద్దరూ ఇంకా ఎంత కాలం ఆడతారో చెప్పడం కూడా కష్టమే...

56

వచ్చే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్ మొత్తం అశ్విన్ ఆడతాడా? దానికి అతనే సమాధానం చెప్పాలి. అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్. అంతేకాకుండా 2023 సీజన్‌ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ, అంతకుముందు సీజన్‌లోనే అశ్వినే హైయెస్ట్ వికెట్ టేకర్. కాబట్టి అశ్విన్‌ని అంత తేలిగ్గా కూర్చోబెట్టలేం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..

66

శార్దూల్ ఠాకూర్ ఏడాదిగా టెస్టులకు దూరంగా ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో శార్దూల్ ఠాకూర్‌కి అవకాశం దక్కలేదు... దీంతో అతనికి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కుతుందా? లేదా? అనేది ఐపీఎల్ పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.. 

click me!

Recommended Stories