భద్రతా కారణాలతో పాకిస్తాన్‌కి టీమిండియాని పంపించలేమని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మెన్ జై షా చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. ఆసియా కప్ కోసం టీమిండియా, పాక్‌కి రాకపోతే... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాక్ జట్టు, ఇండియాలో అడుగుపెట్టదని తేల్చి చెబుతోంది పీసీబీ...