డకౌట్ అయ్యాక ఫ్యాన్స్‌కి ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చిన విరాట్ కోహ్లీ... మళ్లీ ట్వీస్ట్ ఏమీ ఇవ్వడు కదా...

Published : Apr 24, 2022, 04:19 PM IST

విరాట్ కోహ్లీ.. ఓ అసాధారణ రన్ మెషిన్. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌ రికార్డులను ఈజీగా ఊది పారేస్తాడని భావించిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు క్రికెట్ కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బీసీసీఐతో విభేదాలు, మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వీడ్కోలు తర్వాత విరాట్... పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు...

PREV
111
డకౌట్ అయ్యాక ఫ్యాన్స్‌కి ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చిన విరాట్ కోహ్లీ... మళ్లీ ట్వీస్ట్ ఏమీ ఇవ్వడు కదా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 17 సగటుతో 119 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 48 పరుగులు..  అయితే గత రెండు మ్యాచుల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు విరాట్...
 

211

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛమీరా బౌలింగ్‌లో దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి మొదటి బంతికి డకౌట్ అయిన విరాట్ కోహ్లీ... సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుటై నిరాశగా పెవిలియన్ చేరాడు...

311

ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ కావడం, అదీ మొదటిసారి రెండు మ్యాచుల్లోనూ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో అతని ఫామ్ గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది...
 

411

లక్నోతో మ్యాచ్‌లో డకౌట్ అయిన నవ్వుతూ పెవిలియన్ చేరినా, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అవుటైన తర్వాత విరాట్ కోహ్లీ కళ్లల్లో పరుగులు రావడం లేదనే బాధ, డిప్రెషన్.. ఆయన అభిమానులకు స్పష్టంగా కనిపించింది...

511

విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో మిగిలిన బ్యాటర్లు కూడా ఘోరంగా విఫలం కావడంతో ఆరెంజ్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఆర్‌సీబీ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ లక్ష్యాన్ని 8 ఓవర్లలో ఊదేసింది...
 

611

ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా స్టేడియానికి హాజరైన ప్రేక్షకులు... ‘కోహ్లీ... కోహ్లీ... RCB... RCB’ అని అరుస్తూ, టీమిండియా మాజీ కెప్టెన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు...

711

ప్రేక్షకులు తన పేరు అరుస్తున్న సమయంలో వారివైపు తిరిగి ఓ ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. విరాట్ భావోద్వేగానికి గురైనట్టు అతని కళ్లు చూస్తూ తెలుస్తోంది.

811

దీంతో విరాట్ కోహ్లీ మళ్లీ సడెన్ నిర్ణయాలేమీ తీసుకోడు కదా... అని ఆయన అభిమానులు అనుమానిస్తూ, భయపడుతున్నారు.

911

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌కి ముందు టీమిండియా టీ20 కెప్టెన్సీ, ఆర్‌సీబీ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ...

1011
Image Credit: Getty Images

వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించడంతో కేప్‌టౌన్ టెస్టు ముగిసిన తర్వాత టెస్టు ఫార్మాట్‌ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ...

1111

మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా, కెప్టెన్ కేన్ విలియంసన్‌తో చాలాసేపు మాట్లాడుతూ కనిపించాడు విరాట్ కోహ్లీ...

Read more Photos on
click me!

Recommended Stories