నా కెరీర్‌లో 10, 12 ఏళ్లు నిద్రలేకుండానే గడిపేశా, ప్రతీ మ్యాచ్‌కి ముందు... సచిన్ టెండూల్కర్ కామెంట్...

First Published May 17, 2021, 11:34 AM IST

సచిన్ టెండూల్కర్... క్రికెట్ చరిత్రలోనే అనితర సాధ్యమైన రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్న ‘క్రికెట్ గాడ్’... అత్యధిక వన్డేలు, టెస్టులు, పరుగులు, సెంచరీలు, హాఫ్ సెంచరీలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు.. ఇలా సచిన్ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఓ పుస్తకమే రాయొచ్చు...

24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న సచిన్ టెండూల్కర్, తన కెరీర్‌లో సగం జీవితం నిద్రలేకుండానే గడిపేశాడట. ఈ విషయాన్ని తాజాగా అభిమానులతో పంచుకున్నాడు సచిన్ రమేష్ టెండూల్కర్...
undefined
‘నా కెరీర్‌లో ప్రశాంతంగా పడుకున్న రోజుల కంటే నిద్రలేకుండా తీవ్ర ఒత్తిడితో గడిపేసిన రాత్రులే ఎక్కువ. మైదానంలో అడుగుపెట్టడానికి కొన్ని గంటల ముందే నా మైండ్‌లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది...
undefined
రేపు మ్యాచ్ ఉందంటే, ఆ రోజు నిద్రపట్టేది కాదు. ఏ బౌలర్‌ని ఎలా ఎదుర్కోవాలి, ఎన్ని పరుగులు చేయాలి... ఇలా నా మనసునిండా మ్యాచ్ గురించి ఆలోచనలే నిండేవి. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేవాడిని...
undefined
దాదాపు 100 కోట్ల భారతీయుల ఆశలను నేను మోస్తున్నాననే భయం నాలో ఉండేది. నేను ఫెయిల్ అయితే, నా దేశమంతా బాధపడుతుంది. అందుకే ప్రతీ రాత్రీ ఆ ఆలోచనలు నాలో నిండిపోయేవి...
undefined
మ్యాచ్‌కి ముందు శారీరకంగానే కాకుండా మానసికంగా సిద్ధంగా ఉండాలని తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత మ్యాచ్ గురించి ఆలోచించకుండా, ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు రకరకాల పనులు చేసేవాడిని...
undefined
టీవీ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వర్కవుట్ కాకపోతే షాడో బ్యాటింగ్ చేసేవాడిని. అది కూడా నా ఆలోచనలను మ్యాచ్ నుంచి తప్పించకపోతే టీ చేసుకుని, తాగేవాడిని. దానితో పాటు బట్టలు ఐరన్ చేసుకోవడం వంటివి కూడా చేశా...
undefined
నేను నిద్రలేకుండా గడుపుతున్న రాత్రులను చూసి, మా అన్న అజిత్ టెండూల్కర్ ఈ విషయాన్ని నాకు నేర్పించారు. అదే నాకు అలవాటుగా మారిపోయింది. నా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ వరకూ నా దృష్టి మరల్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశా...
undefined
నా కెరీర్‌లో ఎన్నో గాయాలు నన్ను వేధించాయి. కానీ ఓ గాయం నుంచి బయటపడడానికి హోటెల్ వెయిటర్ సాయం చేశాడంటే నమ్ముతారా? అవును డాక్టర్లు ఫిజియోలు కూడా తప్పు ఎక్కడుందో, ఎందుకు నన్ను ఎల్బో గాయం అంతగా వేధిస్తుందో కనిపెట్టలేకపోయారు...
undefined
ఓ రోజు నాకోసం టిఫిన్ తీసుకొచ్చిన ఓ హోటెల్ వెయిటర్, నా ఎల్బో గార్డ్, నా బ్యాటును ఆపుతోందని... ఈ కారణంగానే ఫ్రీగా షాట్స్ ఆడలేకపోతున్నానని చెప్పాడు. ఆ తర్వాత నేను గమనిస్తే, అదే నిజమని తేలింది....
undefined
కెరీర్‌లో ప్రతీ ప్లేయర్‌కి సక్సెస్ ఎంత మజాని ఇస్తుందో, ఫెయిల్యూర్ కూడా అంతే సహజమని గుర్తించాలి. ప్రతీ ఒక్క దశలో ఒకరో ఒకరి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నా... నా కెరీర్‌లో సక్సెస్‌కి నాకు సాయం చేసి ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ దక్కుతుంది’ అంటూ వ్యాఖ్యానించాడు సచిన్ టెండూల్కర్.
undefined
200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్కర్, మొత్తంగా 34 వేలకు పైగా పరుగులు సాధించారు. ఇందులో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
undefined
click me!