ఐపీఎల్ 2021 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... విరాట్ కోహ్లీ కల ఇలా నెరవేరిందా?

Published : May 17, 2021, 09:35 AM IST

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న జట్లలో ముందు వరుసలో ఉంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్‌సీబీ క్రేజ్, ఫాలోయింగ్ పెరిగింది కానీ టైటిల్ మాత్రం రాలేదు...

PREV
113
ఐపీఎల్ 2021 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... విరాట్ కోహ్లీ కల ఇలా నెరవేరిందా?

ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు ‘ఈసాలా కప్ నమ్ దే’ అంటూ ఆర్‌సీబీ ఫ్యాన్స్ హంగామా చేయడం, ఆ తర్వాత కోహ్లీ అండ్ కో పర్ఫామెన్స్ చూశాక నిరాశతో కృంగిపోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. 

213

ఈ సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టైటిల్ ఫెవరెట్‌గా అనిపించింది. అయితే ఆ తర్వాత సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా, తర్వాతి మ్యాచ్‌లో గెలిచి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. మొత్తంగా ఏడు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచి మంచి పొజిషన్‌లోనే ఉన్నట్టు కనిపించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

313

అయితే కరోనా పాజిటివ్ కేసుల కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో అందరి కంటే ఎక్కువగా నిరుత్సాహానికి గురయ్యారు ఆర్‌సీబీ అభిమానులు. లేకలేక మావాళ్లు మంచిగా ఆడుతుంటే, ఇలాంటి సమయంలో ఇలా జరగాలా? అంటూ కరోనా వైరస్ పుట్టడానికి కారణమైన ఆ చైనావోడిని తిట్టుకున్నారు.

413

అయితే ఐపీఎల్ 2021 సీజన్ విజేతగా ఆర్‌సీబీని చూపిస్తోంది గూగుల్. గూగుల్‌లో ‘2021 సీజన్ విజేత ఎవరు? ’ అని సెర్చ్ చేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిజల్ట్‌గా వస్తోంది. దీని వెనక చాలా పెద్ద గణాంకాలే ఉన్నాయి.

513

14 సీజన్లుగా ఆర్‌సీబీనీ సపోర్ట్ చేస్తున్న వీరాభిమాని అదేశ్ జైన్ లెక్కలను చూస్తే, ఈ సీజన్ విజేత ఆర్‌సీబీయే. ఐపీఎల్ 2021 సీజన్ నిరవధిక వాయిదా పడినా, డిఫరెంట్ పిచ్‌ల్లో, గత గణాంకాల ఆధారంగా చూసుకుంటే ‘ఈసారి కప్‌ నమ్‌దే’ అంటున్నాడు జైన్...

613

‘నేను గత గణాంకాలు, ప్రిడిక్షన్స్‌తో కలిపి ప్లేఆఫ్ ఫలితాలతో సహా పైథాన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. దీని ప్రకారం చూసుకుంటే ఈ సీజన్‌ విజేత ఆర్‌సీబీయే. ఆర్సీబీలో ఉన్న ప్లేయర్లు ఇంతకుముందు ఎవరి బౌలింగ్‌లో ఎన్ని పరుగులు చేసింది, ఎన్ని సింగిల్స్, డబుల్స్, బౌండరీలు బాదింది లెక్కలేసి ఈ ప్రోగ్రామ్ చేశాను..’ అంటూ చెప్పుకొచ్చాడు జైన్.

713

మనోడి ప్రిడిక్షన్ టేబుల్ ప్రకారం సీజన్ గ్రూప్ మ్యాచులు ముగిసేసరికి 11 విజయాలు, 3 పరాజయాలతో 22 పాయింట్లు సాధించి ఆర్‌సీబీ టాప్‌లో ఉంటే, ఢిల్లీలో 10 విజయాలు, సీఎస్‌కే 8 విజయాలు, పంజాబ్ కింగ్స్, ముంబై ఏడేసి విజయాలతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉంటాయి.

813

క్వాలిఫైయర్ 1లో ఢిల్లీని ఓడించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. ఎలిమినేటర్‌లో పంజాబ్, సీఎస్‌కేను చిత్తు చేస్తుంది. 

913

క్వాలిఫైయర్ 2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరోసారి ఫైనల్‌కి చేరుతుంది ఢిల్లీ జట్టు. ఫైనల్‌లో ఆర్‌సీబీ, ఘనవిజయం సాధించి... ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకుంటుంది.

1013

అయితే ఈ టేబుల్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఇప్పటికే ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుంది. సీఎస్‌కే జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేధించి అదరగొట్టింది. అలాంటి ముంబై ప్లేఆఫ్ కూడా చేరదని అంచనా వేయడం అతిపెద్ద తప్పిదంగా పేర్కొంటున్నారు ఎంఐ ఫ్యాన్స్.

1113

మొదటి ఏడు మ్యాచుల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కి గ్రూప్ స్టేజ్‌లో 8 విజయాలే దక్కుతాయని అంచనా వేశాడు అదేశ్ జైన్. అంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడుతుంది సీఎస్‌కే. చెన్నై ఇప్పుడు ఫామ్ చూస్తే ఇది అసాధ్యమనే చెప్పాలి.

1213

మిగిలిన జట్ల పరిస్థితి ఎలా ఉన్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రీడిక్షన్ టేబుల్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ వాయిదా పడేసరికి ఏడు మ్యాచుల్లో ఒక్కటే విజయం అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, మొత్తంగా 14 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంటుందని అంచనా వేశాడు జైన్.

1313

అంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో 4 విజయాలు. మొత్తంగా ఇది చాలా మంచి ప్రదర్శనే అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ 4 విజయాలతో ఏడో స్థానంలో నిలిస్తే, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆఖరి స్థానంలో ఉంటుందని తన గణాంకాలతో బల్లగుద్ది చెబుతున్నాడు జైన్.

click me!

Recommended Stories