ఐపీఎల్‌లో మనోడే చీప్ కెప్టెన్.. టాప్‌లో కెఎల్ రాహుల్! ఏ కెప్టెన్ ఎంత తీసుకుంటున్నాడంటే...

First Published Mar 3, 2023, 5:11 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరో 28 రోజుల్లో 16వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఘనంగా మొదలు కానుంది. ఇప్పటికే ఫ్రాంఛైజీలన్నీ క్యాంపులు పెట్టేశాయి. మరి ఈ ఐపీఎల్‌లో ఏ కెప్టెన్‌ ఎంత తీసుకుంటున్నాడు...

అయిడిన్ మార్క్‌రమ్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు సౌతాఫ్రికా యంగ్ బ్యాటర్, ఆల్‌రౌండర్ అయిడిన్ మార్క్‌రమ్. మార్క్‌రమ్‌ని ఐపీఎల్ 2022 వేలంలోరూ.2 కోట్ల 60 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్. ఐపీఎల్‌లో అత్యంత చవకైన కెప్టెన్ మనోడే..

Image credit: PTI

డేవిడ్ వార్నర్: రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. వార్నర్‌ని 2022 వేలంలోరూ.6 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

Latest Videos


Image credit: PTI

ఫాఫ్ డుప్లిసిస్: విరాట్ కోహ్లీ తప్పుకున్నాక 2022 సీజన్‌ నుంచి ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు సఫారీ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్. డుప్లిసిస్‌ని 2022 మెగా వేలంలో రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

Image credit: PTI

శిఖర్ ధావన్: ప్రతీ సీజన్‌కి ముందు కెప్టెన్‌ని మార్చే పంజాబ్ కింగ్స్, ఈసారి కూడా కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. ఈసారి శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఆడనుంది పంజాబ్ కింగ్స్. ధావన్‌ని రూ.8 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది ప్రీతి జింటా టీమ్...

Image credit: PTI

మహేంద్ర సింగ్ ధోనీ: రవీంద్ర జడేజాకి రూ.16 కోట్లు ఇచ్చి, తాను రెండో రిటైన్ ప్లేయర్‌గా రూ.12 కోట్లు తీసుకున్నాడు ధోనీ. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ సీఎస్‌కే కెప్టెన్ రూ.12 కోట్లు అందుకోబోతున్నాడు...


శ్రేయాస్ అయ్యర్: ఐపీఎల్ 2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ని రూ.12 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. గత సీజన్‌లో కోల్‌కత్తాకి కెప్టెన్సీ చేసిన అయ్యర్, ఈసారి కూడా ఆ టీమ్‌ని నడిపించబోతున్నాడు..

సంజూ శాంసన్: రాజస్థాన్ రాయల్స్‌ని ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైనల్‌కి చేర్చాడు సంజూ శాంసన్. ఐపీఎల్ 2022 సీజన్‌లో శాంసన్‌ని రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్ టీమ్..

Image credit: PTI

హార్ధిక్ పాండ్యా: ఐపీఎల్ 2022 టైటిల్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, రూ.15 కోట్లు తీసుకుంటున్నాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి టైటిల్ గెలిచిన పాండ్యా టీమ్‌పై ఈసారి భారీ అంచనాలున్నాయి...

రోహిత్ శర్మ: ఫైవ్ టైం ఐపీఎల్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మను రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. ఐపీఎల్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న కెప్టెన్‌గా రెండో స్థానంలో నిలిచాడు రోహిత్..  

KL Rahul

కెఎల్ రాహుల్: లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఏకంగా రూ.17 కోట్లు పెట్టి కెఎల్ రాహుల్‌ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న కెప్టెన్‌గా (వరుసగా రెండో ఏడాది) రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు కెఎల్ రాహుల్.. 

click me!