సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల్లో ఎవరు గొప్ప అంటే... తెలివిగా సమాధానం ఇచ్చిన స్టీవ్ స్మిత్...

First Published Jan 13, 2023, 5:52 PM IST

ప్రస్తుత తరంలో మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. మూడేళ్ల విరామం తర్వాత తిరిగి సెంచరీల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డుకి మెల్లిమెల్లిగా చేరువవుతున్నాడు...

విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన ఒక్కో రికార్డును చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ తరుణంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల్లో ఎవరు గొప్ప? అనే ప్రశ్న మరోసారి లేవనెత్తుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ ప్రశ్నకు తన స్టైల్‌లో సమాధానం చెప్పాడు. ‘సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల్లో ఎవరు గొప్ప బ్యాటర్ అంటే చెప్పడం కష్టం. కోహ్లీ చాలా తక్కువ సమయంలోనే 73 సెంచరీలు సాధించాడు... విరాట్ సాధించిన రికార్డులను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేదు’ అంటూ సమాధానం చెప్పాడు సౌరవ్ గంగూలీ...

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అయితే సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లీకి పోలికే అవసరం లేదని కొట్టిపారేశాడు. ‘నేను పుట్టకముందు నుంచే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్నారు. నేను క్రికెట్ టీమ్‌లోకి వచ్చేదాకా ఆయన ఆడుతూనే ఉన్నారు. ఆయన నా ఐడెల్. సచిన్ టెండూల్కర్‌‌ కంటే గొప్ప బ్యాటర్‌ని చూడలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్...

తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి ఇదే ప్రశ్న ఎదురైంది. వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా, టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా ఆసీస్ టెస్టు ప్లేయర్ మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌ని కొన్ని ప్రశ్నలు వేశాడు...

‘సచిన్ టెండూల్కర్ లేదా విరాట్ కోహ్లీ వీరిలో ఎవరు బెస్ట్?’ అంటూ స్టీవ్ స్మిత్‌ని ప్రశ్నించాడు లబుషేన్. దీనికి కాసేపు ఆలోచించి... ‘ఇది చాలా కఠినమైన ప్రశ్న. నా ఉద్దేశంలో టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ గ్రేట్. వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ... వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ రికార్డులు అసాధారణం. అతన్ని కొట్టేవాడు లేడు..’ అంటూ సమాధానం ఇచ్చాడు స్టీవ్ స్మిత్...

‘భారత జట్టులోని ఏ ఇద్దరు ప్లేయర్లను నీ టీమ్‌లో ఆడించాలని అనుకుంటావు?’ అని మరో ప్రశ్నకు కూడా ఇలాంటి సమాధానమే చెప్పాడు స్టీవ్ స్మిత్. ‘విరాట్ కోహ్లీని నా టీమ్‌లో తప్పకుండా ఉంచుకుంటాను. అతను బెస్ట్ ప్లేయర్. అలాగే జస్ప్రిత్ బుమ్రాని సెలక్ట్ చేసుకుంటా. బుమ్రా బౌలింగ్‌లో ఆడడం కష్టంగా ఉంటుంది...’ అంటూ సమాధానం ఇచ్చాడు స్టీవ్ స్మిత్...

Steve Smith and Marnus Labuschagne

సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్, టెస్టుల్లో 30 సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు స్టీవ్ స్మిత్... జో రూట్ 29 సెంచరీలు బాదగా విరాట్ కోహ్లీ మూడేళ్ల నుంచి 27 టెస్టు సెంచరీల దగ్గరే ఆగిపోయాడు.. 

click me!