అందరి కంటే ముందు వస్తాడు, అందరూ వెళ్లాకే వెళ్తాడు... విరాట్ కోహ్లీపై జోష్ హజల్‌వుడ్ కామెంట్...

Published : May 31, 2023, 03:18 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు జోష్ హజల్‌వుడ్. అందుకే అతన్ని రూ.7 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...  

PREV
16
అందరి కంటే ముందు వస్తాడు, అందరూ వెళ్లాకే వెళ్తాడు... విరాట్ కోహ్లీపై జోష్ హజల్‌వుడ్ కామెంట్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 12 మ్యాచులు ఆడి 20 వికెట్లు తీసిన జోష్ హజల్‌వుడ్, గాయం కారణంగా 2023 సీజన్‌లో 3 మ్యాచులు మాత్రమే ఆడి 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 9 ఓవర్లలో 3 వికెట్లు తీసిన జోష్‌ హజల్‌వుడ్, విరాట్ కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు..
 

26

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జోష్ హజల్‌వుడ్, ఆస్ట్రేలియా తరుపున కీ బౌలర్‌గా బరిలో దిగబోతుంటే టీమిండియా, విరాట్ కోహ్లీపైన భారీ ఆశలే పెట్టుకుంది...

36

‘విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాడు. అతని ఫిట్‌నెస్ చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. అతని స్కిల్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో టాప్ క్లాస్‌ స్కిల్స్ చూపిస్తాడు...

46

ట్రైయినింగ్ సెషన్స్‌కి అందరి కంటే ముందు వస్తాడు, అందరూ వెళ్లిన తర్వాతే వెళ్తాడు. అంత సేపు ప్రాక్టీస్ చేసినా అస్సలు అలిసిపోడు, అంతేకాకుండా తనతో పాటు మిగిలిన వాళ్లను కూడా ప్రాక్టీస్ చేసేలా ప్రోత్సహిస్తాడు... 
 

56

ఈసారి ఆర్‌సీబీలోకి కాస్త లేటుగా వెళ్లాడు. మహ్మద్ సిరాజ్ ప్రతీ సీజన్‌లోనూ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో సిరాజ్ మెయింటైన్ చేసిన ఎకానమీ అసాధ్యం.. 

 

66

అక్కడ అతను 6, ఆరున్నర ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. బంతిపైన అతనికి పూర్తి పట్టు వచ్చింది. అతని బౌలింగ్ గురించి మా వాళ్లను ఇప్పటికే హెచ్చరించాను...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్‌వుడ్.. 
 

Read more Photos on
click me!

Recommended Stories