ఐపీఎల్ 2023 సీజన్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు మోహిత్ శర్మ. కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో అమ్ముడుపోని ప్లేయర్‌గా ఉన్న మోహిత్ శర్మ, గత ఏడాది గుజరాత్ టైటాన్స్‌కి నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో 25 వికెట్లు తీసి అదరగొట్టాడు...
ఐపీఎల్ 2023 సీజన్‌లో 17మ్యాచుల్లో 28 వికెట్లు తీసిన మహ్మద్ షమీ పర్పుల్ క్యాప్ గెలిస్తే, అదే టీమ్ నుంచి రషీద్ ఖాన్ 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీశారు. లేటుగా ఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ 14 మ్యాచుల్లో 25 వికెట్లు పడగొట్టాడు. మోహిత్ మొదటి 3 మ్యాచుల్లోనూ ఆడి ఉంటే పర్పుల్ క్యాచ్ గెలిచి ఉండేవాడు...
28
PTI Photo/R Senthil Kumar)(PTI05_23_2023_000316B)
ఫైనల్‌లోనూ మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ వెళ్లిందంటే దానికి కారణం మోహిత్ శర్మ బౌలింగే. 10 ఓవర్లలో 112 పరుగులు చేసిన సీఎస్‌కే, ఆఖరి 5 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన స్థితికి చేరిన సమయంలో మోహిత్ శర్మకు బాల్ అప్పగించాడు హార్ధిక్ పాండ్యా...
38
Mohit Sharma
మొదటి ఓవర్‌లో 6 పరుగులే ఇచ్చి అజింకా రహానేని అవుట్ చేసిన మోహిత్ శర్మ, తన రెండో ఓవర్‌లో అంబటి రాయుడు, ధోనీలను వెంటవెంటనే అవుట్ చేశాడు. చివరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు కావాల్సి రాగా మొదటి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాడు...
48
ఆఖరి 2 బంతుల్లో 10 పరుగులు కావాల్సి ఉండడంతో ఇక గెలిచేశామని అనుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, మోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇదే అతని రిథమ్‌ని దెబ్బ తీసిందని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
ఆఖరి రెండు బంతుల్లో ఓ 6, ఓ 4 బాది మ్యాచ్‌ని ముగించాడు రవీంద్ర జడేజా..
58
Image credit: PTI
‘బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ, యార్కర్లు వేస్తున్నప్పుడు... నువెళ్లి అతనితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? 2 బంతుల్లో 10 పరుగులు కావాల్సినప్పుడు యార్కర్లు ఎలా వేయాలో మోహిత్ శర్మకు బాగా తెలుసు. నువ్వెళ్లి బోడి సలహాలు చెప్పడం దేనికి...
68
హార్ధిక్ పాండ్యా వెళ్లి డిస్టర్బ్ చేయడం వల్లే మోహిత్ రిథమ్ దెబ్బ తింది. అతన్ని అలాగే వదిలేసి ఉంటే కచ్చితంగా గుజరాత్ టైటాన్స్‌ని గెలిపించి ఉండేవాడు. కనీసం ఇంకో బాల్ వేసేదాకా అతన్ని వదిలేసి ఉండాల్సింది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
78
Image credit: PTI
సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మోహిత్ శర్మ మొదటి నాలుగు బంతులు అద్భుతంగా వేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఓవర్ మధ్యలో నీళ్లు తాపించారు, హార్ధిక్ పాండ్యా వచ్చి ఏదేదో చెప్పాడు..
88
Image credit: PTI
బౌలింగ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. నాలుగు బాల్స్ లైన్ అండ్ లెంగ్త్ మిస్ కాకుండా వేసిన వాడు, ఇంకో రెండు బంతులు వేయలేడా? ఆ టైమ్‌లో వెళ్లి అతన్ని డిస్టర్బ్ చేయడమే హార్ధిక్ పాండ్యా చేసిన అతి పెద్ద తప్పు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్..