ఇక బాల్ రాహుల్ ద్రావిడ్ కోర్టులోనే ఉంది... పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్...

First Published Jan 23, 2022, 2:18 PM IST

రవిశాస్త్రి తర్వాత భారీ అంచనాలతో టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టాడు రాహుల్ ద్రావిడ్. టీమిండియా మాజీ క్రికెటర్‌గా, అండర్-19 జట్టు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ సాధించిన విజయాలు, అతనిపై భారీ అంచనాలు పెంచేశాయి...

హెడ్ కోచ్‌గా పదవి చేపట్టిన తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశాడు రాహుల్ ద్రావిడ్. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు, కివీస్‌ను చిత్తు చేసింది...

అయితే భారత జట్టు, టీ20 వరల్డ్‌కప గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటికి వచ్చి... రిలాక్స్‌గా సిరీస్ ఆడితే, న్యూజిలాండ్ మాత్రం పొట్టి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడి, భారత్‌లో పర్యటించింది...

దాంతో న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినా, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి కానీ, రోహిత్ శర్మ కెప్టెన్సీకి కానీ పెద్దగా పేరు వచ్చింది లేదు...

టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌లో అసలు ఛాలెంజ్ ఎదుర్కొంది...

సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవడమే లక్ష్యంగా సఫారీ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకి ఆ ఆశ నెరవేరలేదు సరికదా, వన్డే సిరీస్ కూడా కోల్పోయింది...

దీంతో కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌పై విమర్శలు మొదలయ్యాయి. రవిశాస్త్రి కోచింగ్‌లో ఆడిలైడ్ టెస్టు ఓడిన తర్వాత టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు, ద్రావిడ్ కోచింగ్‌లో సెంచూరియన్ టెస్టు గెలిచిన తర్వాత టెస్టు సిరీస్ ఓడింది...

‘రాహుల్ ద్రావిడ్‌, ఇప్పటికే ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉండొచ్చు. భారీ అంచనాలతో పదవి చేపట్టిన ఎవ్వరికైనా ఇలాంటి ఒత్తిడి ఎదురుకావడం కామన్...

రవిశాస్త్రి సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆ ప్లేస్ తీసుకోవడం అంటే చాలా కష్టమే. ద్రావిడ్ ఓవర్ రేటెడ్ కోచ్‌ కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్... 

click me!