Published : Sep 19, 2021, 10:10 PM ISTUpdated : Sep 19, 2021, 10:20 PM IST
ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో మొదటి మ్యాచే క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత కిక్‌ని అందించింది. ఆరంభంలో వన్ సైడెడ్‌గా సాగుతున్నట్టు కనిపించిన మ్యాచ్‌ను మలుపుతిప్పి, సీఎస్‌కేలో స్టార్‌గా మారాడు రుతురాజ్ గైక్వాడ్... తన ఇన్నింగ్స్‌లో పలు రికార్డులను క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్...
58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు.
210
ఇంతకుముందు మైక్ హుస్సీ 2013లో ముంబై ఇండియన్స్‌పై 58 బంతుల్లో 86 పరుగులు చేశాడు.. హుస్సీని అధిగమించిన రుతురాజ్ గైక్వాడ్, ముంబై వర్సెస్ చెన్నై మ్యాచుల్లో రెండో టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు...
310
2008లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 48 బంతుల్లో 114 పరుగులు చేసిన సనత్ జయసూర్య మాత్రమే, రుతురాజ్ గైక్వాడ్ కంటే ముందున్నాడు...
410
గత 14 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలవడం రుతురాజ్ గైక్వాడ్‌కి ఇది ఐదోసారి. రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ కారణగా తొలి 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు మాత్రమే చేసిన సీఎస్‌కే, ఆ తర్వాత 9 ఓవర్లలో 108 పరుగులు రాబట్టగలిగింది...
510
యూఏఈలో జరిగిన 2020 ఐపీఎల్ ఆఖరి మూడు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన రుతురాజ్ గైక్వాడ్, అక్కడ వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ నమోదుచేయడం విశేషం...
610
ముంబై ఇండియన్స్ తరుపున పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా బుమ్రాతో కలిసి మూడో స్థానంలో నిలిచాడు ట్రెంట్ బౌల్డ్. లసిత్ మలింగ పవర్‌ప్లేలో 37 వికెట్లు తీయగా, మిచెల్ మెక్‌లగాన్ 31 వికెట్లు తీశాడు... బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ 20 వికెట్లు తీశారు...
710
టాప్ 3లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది మూడోసారి. ఇంతకుముందు 2008లో రాజస్థాన్ రాయల్స్‌పై, 2011లో పంజాబ్ కింగ్స్‌పై ఇలా ఇద్దరు సీఎస్‌కే టాపార్డర్ బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు.
810
తొలి మూడు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోవడం సీఎస్‌కేకి ఐదోసారి. అందులో తొలిసారి 2008లో రాజస్థాన్ రాయల్స్‌పై ఇలా 3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోగా, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌పై నాలుగు సార్లు ఈ చెత్త రికార్డు క్రియేట్ చేసింది..
910
ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత ఐదు మ్యాచుల్లో సురేష్ రైనా వరుసగా 2,5,8,2,4 పరుగులు చేసి డబుల్ డిజిట్ స్కోరు కూడా చేరుకోలేకపోగా... మహేంద్ర సింగ్ ధోనీ గత 3 ఇన్నింగ్స్‌లో ముంబైపై 19 పరుగులు మాత్రమే చేశాడు...
1010
ఐపీఎల్‌లో 73 వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్, లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు... ముంబై మాజీ బౌలర్, న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ మెక్‌లాగన్ 71 ఐపీఎల్ వికెట్లు తీశాడు.