IPL2021 CSKvsMI: ఎమ్మెస్ ధోనీ కూడా అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

First Published Sep 19, 2021, 8:27 PM IST

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 సీజన్‌కి ఊహించని ఆరంభం లభించింది.  టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, 6 ఓవర్లలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కూడా 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే, మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోయిన రెండు వికెట్లూ, డకౌట్ కావడం మరో విశేషం...

మొదటి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న ఫాఫ్ డుప్లిసిస్, భారీ షాట్‌కి ప్రయత్నించి మిల్నేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. ఆ తర్వాత మిల్నే బౌలింగ్‌లో మొయిన్ ఆలీ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు...

మూడు బంతులు ఆడిన మొయిన్ ఆలీ షాట్‌కి ప్రయత్నించగా, సౌరబ్ తివారి కళ్లు చెదిరే క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ చేర్చాడు. 2 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై సూపర్ కింగ్స్...

ఆ తర్వాత మిల్నే బౌలింగ్‌లోనే ఆఖరి బంతిని ఎదుర్కొన్న అంబటి రాయుడు గాయంతో పెవిలియన్ చేరాడు. అంబటి రాయుడి గాయం తీవ్రమైతే, సీఎస్‌కే జట్టుపై ఆ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది...  

6 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి సురేష్ రైనా, ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో రాహుల్ చాహార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో 7 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది సీఎస్‌కే...

ఆ తర్వాత 5 బంతుల్లో 3 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ, ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి... ట్రెంట్ బౌల్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 24 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...

9వ ఓవర్ ఆఖరి బంతికి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటుకి తాకుతూ వచ్చిన బంతిని అందుకోవడంలో డి కాక్ విఫలం అయ్యాడు. లేదంటే ఐదో వికెట్ కూడా కోల్పోయేది సీఎస్‌కే...

click me!