బాల్ వేస్తే రూ. 49 లక్షలు పడ్డట్టే.. ఐపీఎలా మజాకా.. ఆసక్తి రేపుతున్న కొత్త లెక్కలు

Published : Jun 15, 2022, 03:42 PM IST

IPL Media Rights: ఐపీఎల్ ను క్యాష్ రిచ్ లీగ్ అంటారందరు.  ఆ పేరును సార్థకం చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ లీగ్. మీడియా హక్కుల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించింది. 

PREV
16
బాల్ వేస్తే రూ. 49 లక్షలు పడ్డట్టే.. ఐపీఎలా మజాకా.. ఆసక్తి రేపుతున్న కొత్త  లెక్కలు

ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రాబోయే ఐదేండ్ల కాలానికి  గాను బీసీసీఐ రూ. 48,390 కోట్ల ఆదాయాన్ని పొందనున్నది. టీవీ ప్రసారాలు, డిజిటల్ హక్కుల ద్వారా  రానున్న ఈ ఆదాయంతో బీసీసీఐ.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రీడా లీగ్ గా అవతరించింది. 

26

అయితే మీడియా హక్కుల ద్వారా వచ్చిన ఆదాయాన్నిబట్టి చూస్తే ఐపీఎల్-16 నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ విలువ రూ. 118 కోట్లుగా ఉండనుంది. ఈ జాబితాలో  ఎన్ఎఫ్ఎల్ (రూ. 133 కోట్లు) తర్వాత  ఐపీఎల్ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

36

తాజాగా బీసీసీఐకి రాబోతున్న భారీ ఆదాయాన్ని ఒక్కో మ్యాచ్ కు కాకుండా ఒక్కో ఓవర్ కు.. ఒక్కో బంతికి గణిస్తే ఎంత వస్తుందో తెలిస్తే కంగుతినడం ఖాయం. 

46

రాబోయే ఐదు సీజన్లకు గాను బీసీసీఐ 410 మ్యాచులను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఒక్కో మ్యాచ్ విలువ రూ. 118 కోట్లు.  ఇక మ్యాచ్ లో ఒక బౌలర్ వేసే ఓవర్ విలువ రూ. 2.95 కోట్లుగా ఉంది. ఓవర్ లో ఒక్కో బంతి విలువ ఏకంగా రూ. 49 లక్షలుగా తేలింది. 

56

ఈ లెక్కలు వింటుంటే రాబోయే సీజన్లలో  ఐపీఎల్ ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017-2022 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 16,347.50 కోట్లుగా ఉండగా.. 2023-27 కాలానికి అవి దాదాపు మూడింతలు అవడం గమనార్హం. 

66

ఐపీఎల్ లో సూపర్ ఫాస్ట్ డెలివరీ వేసిన బౌలర్లకు ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులు ఇస్తున్న ఆయా సంస్థలు.. తాజా గణాంకాలతో మరెన్ని పేర్లు పెట్టి  బౌలర్లకు కాసుల పంట పండిస్తాయో వేచి చూడాలి మరి.. 

click me!

Recommended Stories