IPL Media Rights: అందుకే ఐపీఎల్ డిజిటల్ హక్కులను వదులుకున్నాం : డిస్నీ స్టార్

Published : Jun 15, 2022, 03:01 PM IST

IPL Media Rights: ముంబైలో మూడు రోజుల పాటు ఉత్కంఠగా జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియలో భాగంగా ఉపఖండంలో టీవీ  ప్రసారాలను దక్కించుకున్న డిస్నీ స్టార్.. డిజిటల్ హక్కులను కోల్పోయింది. 

PREV
17
IPL Media Rights: అందుకే ఐపీఎల్ డిజిటల్ హక్కులను వదులుకున్నాం :  డిస్నీ స్టార్

గత ఐదేండ్లుగా ఐపీఎల్  మీడియా హక్కుల ప్రసారదారుగా ఉన్న డిస్నీ స్టార్.. ఈ ఏడాది కూడా భారీ ధర వెచ్చించి వాటిని దక్కించుకుంది. అయితే గతంలో మాదిరిగా టీవీ, డిజిటల్ ప్రసారాలను గంపగుత్తగా ఒకే సంస్థకు ఇవ్వకుండా నాలుగు ప్యాకేజీలుగా విభజించి వాటికి వేలం వేసిన విషయం తెలిసిందే. 

27

కాగా ఉపఖండంలో టీవీ ప్రసారాలను నిలుపుకున్న డిస్నీ స్టార్.. డిజిటల్ హక్కులను మాత్రం కోల్పోయింది. రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18తో పాటు టైమ్స్ ఇంటర్నెట్ (కొన్ని ప్రత్యేక మ్యాచ్ లకు) గెలుచుకుంది. 

37

అయితే తాము టీవీ హక్కులను దక్కించుకుని డిజిటల్ హక్కులను వదిలేయడానికి గల కారణాలను తాజాగా వాల్ట్ డిస్నీ ఇంటర్నేషనల్ కంటెంట్ అండ్ ఆపరేషన్స్ చైర్మన్ రెబెకా క్యాంప్ బెల్ స్పందించింది. 

47

ఆమె మాట్లాడుతూ.. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వచ్చే ఐదేండ్లు ఐపీఎల్ ను టీవీలలో  చూసే అభిమానులకు  ఇంకా బాగా ఐపీఎల్ ను ఎలా అందించాలనేదానిపై మేం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం. 

57

మీడియా రైట్స్ వేలం విషయంలో మేం  దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో కూడిన బిడ్స్ వేశాం. డిజిటల్ హక్కుల విషయంలో నిర్దేశించిబడిన ధరతో  ఆ ప్యాకేజీని సెక్యూర్ చేసుకోలేమని మాకు అనిపించింది. అందుకే అందులో బిడ్ వేయకూడదని నిశ్చయించుకున్నాం. 

67

ఇండియాలో మా టెలివిజన్ (స్టార్) ఛానెల్ కోణంలో ఐపీఎల్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే దానిని వదులుకోలేదు..’ అని తెలిపింది. అయితే డిజిటల్ హక్కులు కోల్పోయినా తాము ఐసీసీ, బీసీసీఐ తో రాబోయే రోజుల్లో మరిన్ని భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని ఆశాభావం వ్యక్తంచేసింది. 

77

ఇవేగాక తాము ప్రో కబడ్డీ లీగ్ తో పాటు ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ హక్కులను కూడా కలిగిఉన్నామని.. వింబూల్డన్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ హక్కులను కూడా దక్కించుకున్నామని రెబెకా చెప్పింది. 

click me!

Recommended Stories