రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో బలహీనంగా కనిపించింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేయగా, కెప్టెన్ రియాన్ పరాగ్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ధ్రువ్ జురెల్ 33 పరుగులు చేశాడు. స్వల్ప టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన కేకేఆర్ కు ఆ టీమ్ బ్యాటర్లు మంచి ఆరంభం అందించారు. మరీ ముఖ్యంగా 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో కేకేఆర్ కు క్వింటన్ డీకాక్ విజయాన్ని అందించాడు.
క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ !
ఈ మ్యాచ్ లో క్వింటన్ డీకాక్ అద్భుతమైన ఆటతో ఆలరించాడు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి సూపర్ షాట్స్ తో రాజస్థాన్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. 61 బంతుల్లో 97* పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. రఘువంశీ 22 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో 17.3 ఓవర్లలో కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 153 పరుగులతో విజయాన్ని అందుకుంది. జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు పరుగుల వేటలో కేకేఆర్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు.
కేకేర్ ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్-ప్లేయర్లు
97* - క్వింటన్ డి కాక్ vs RR, గౌహతి, 2025
94 - మనీష్ పాండే vs PBKS, బెంగళూరు, 2014 ఫైనల్
93* - క్రిస్ లిన్ vs GL, రాజ్‌కోట్, 2017
92 - మన్వీందర్ బిస్లా vs CSK, చెన్నై, 2013
90* - గౌతమ్ గంభీర్ vs SRH, హైదరాబాద్, 2016