Quinton de Kock
Rajasthan Royals vs Kolkata Knight Riders: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) - కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో 6వ మ్యాచ్‌లో తలపడ్డాయి. గౌహతిలో జరిగిన ఈ మ్యాచ్ లో అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టింది. క్వింటన్ డీకాక్ సూపర్ నాక్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 151/9 పరుగులు చేసింది. ఈ స్వల్ప టార్గెట్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ క్వింటన్ డీ కాక్ అద్భుతమైన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో ఈజీగానే అందుకుంది.
Image Credit: TwitterKKR
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే 20 ఓవర్లలో 151/9 పరుగులు చేసింది. ధ్రువ జురేల్ 33 పరుగులు, జైస్వాల్ 29, పరాగ్ 25 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. కేకేఆర్ బౌలింగ్ దెబ్బకు పరుగులు చేయడానికి ఆర్ఆర్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అరోరా 2, వరుణ్ చక్రవర్తి 2, హర్షిత్ రాణా 2, మోయిన్ అలీ 2 వికెట్లు తీసుకున్నారు.
Team KKR (Photo: IPL)
బ్యాటింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ బౌలింగ్ లో కూడా కేకేఆర్ ను అడ్డుకోలేకపోయింది. కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డీ కాక్ మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత కూడా మరింత దూకుడుగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు.
అయితే, టార్గెట్ మరింత పెద్దదిగా ఉండివుంటే డీకాక్ తన సెంచరీని పూర్తి చేసేవాడు. అతను 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. 61 బంతుల్లో 97* పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అతనికి తోడుగా రఘువంశీ 22 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 17.3 ఓవర్లలో కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 153 పరుగులతో విజయాన్ని అందుకుంది.