Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణం చెప్పేసిన విరాట్ కోహ్లి

First Published Oct 13, 2021, 2:09 PM IST

IPL2021: ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఎనిమిది సీజన్లు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లి.. ఇటీవలే తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే రెండ్రోజుల క్రితం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. 

IPL రెండో దశ ప్రారంభం కాగానే భారత కెప్టెన్ Virat Kohli దేశ క్రికెట్ అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ కూ షాకింగ్ న్యూస్ చెప్పాడు.  భారత టీ20 జట్టుతో పాటు ఆర్సీబీ జట్టుకు సారథిగా వైదొలుగుతున్నానని ప్రకటించాడు. 

विराट कोहली

అయితే కోహ్లి కోసమైనా ఈసారి కప్పు కొడుతామని చెప్పిన RCB ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ లో తుదికంటా పోరాడినా వారికి విజయం దక్కలేదు. ప్లేఆఫ్స్ చేరినా మరోసారి ఉత్త చేతుల్తోనే టోర్నీ నుంచి royal Challengers Basnglore నిష్క్రమించింది. 

అయితే కెప్టెన్ గా చివరి మ్యాచ్ ఆడిన కోహ్లి.. తాను సారథ్య బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకుంటున్నాడో వివరించాడు. 

కోహ్లి మాట్లాడుతూ... ‘ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్నప్పట్నుంచి నేను ఆటగాడిగా జట్టుకు వంద శాతం ఇవ్వలేకపోతున్నాను. నేను 80 శాతం పనిచేయాలనుకోవడం లేదు. అంతేగాక కెప్టెన్సీ భారం వల్ల నేను నా జట్టుకు పూర్తి శక్తిని కేటాయించలేకపోతున్నాను. 

కెప్టెన్  కంటే ముందు నేను ఒక ఆటగాడిని. నా మొదటి ఓటు కెప్టెన్ గా కంటే ఆటగాడికే. నేను సాధ్యమైనంత ఉత్తమమైన స్థితిలో ఉండాలని అనుకుంటున్నాను. అప్పుడే నా జట్టుకు సహకరించగలను’ అని కోహ్లి చెప్పాడు. 

అంతేగాక తన సహచరుడు AB Devilliers చెప్పినట్టు.. ఇది స్వార్థపూరిత నిర్ణయం కాదని కోహ్లి చెప్పాడు. ఎందుకంటే జట్టు కోసం మీరు నిజంగా ఏం చేయాలనుకుంటున్నారో దానిని నిజాయితీగా చేయాలని అన్నాడు. 

ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నప్పుడు చాలా మంది యువకులను ప్రోత్సహించానని, జట్టు కోసం సరైన నిర్ణయాలే తీసుకున్నానని విరాట్ చెప్పాడు. 

కాగా కోహ్లి గురించి ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. ఆర్‌సీబీ జట్టులో మరియు అంతర్జాతీయ స్థాయిలో నీ విజయం కోసం ఎదురుచూస్తున్నాను. జట్టు కోసం నువ్ చేసిన ప్రతీది బాగుంది. అందుకు నీకు ధన్యవాదాలు. కెప్టెన్​గా కోహ్లీ అనగానే గొప్పతనం అనే మాట గుర్తొస్తుంది. అతడు కెప్టెన్​గా జట్టును ముందుండి నడిపించిన తీరు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపింది. ఇది ట్రోఫీని సాధించిన దానికన్నా చాలా ఎక్కువ. కోహ్లీ గొప్పగా ప్రయత్నించాడు. ఇంకా ఈ ఆట ముగియలేదు. నువ్వు మాకోసం చేసిందేదీ మేం మర్చిపోం. ఈ జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 

click me!