అతడి మీద పెట్టిన పెట్టుబడి వేస్ట్.. ఆర్సీబీ ప్లేయర్ క్రిస్టియన్ పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు

First Published Oct 12, 2021, 5:13 PM IST

IPL2021: ఒక్క మ్యాచ్.. ఏడాదిపాటు పడ్డ కష్టాన్నంతా తుడుచుపెట్టేసింది. IPL లీగ్ మ్యాచుల్లో అదరగొట్టిన Royal Challengers Banglore ఎప్పటిలాగే ప్లేఆఫ్స్ లో వెనుదిరిగింది. అయితే ఆర్సీబీ ఓటమికి కారణమని భావిస్తున్న ఓవర్ వేసిన డేనియల్ క్రిస్టియన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెత్తగా బౌలింగ్ వేసిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ Daniel Christian పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అభిమానులు ఆయన భార్య ను తిడుతూ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు. ఇక తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా  స్పందిస్తూ.. అసలు క్రిస్టియన్  మీద ఆర్సీబీ పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందని అన్నాడు. 

12 వ ఓవర్ వేసిన క్రిస్టియన్.. ఆ ఓవర్ లో మూడు సిక్సర్లు సమర్పించుకున్నాడు. దీంతో అప్పటిదాకా బెంగళూరు వైపు ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా కోల్కతా వైపునకు మళ్లింది. 

ఇదే విషయమై Aakash Chopra మాట్లాడుతూ.. ‘మీరు అదృష్టవంతులను కనుగొనడానికి ప్రయత్నిస్తే జట్టు వెనుకబడుతుంది. క్రిస్టియన్ విషయంలో మీరు (RCB) పెట్టిన పెట్టుబడి నిష్పలమైంది. అతడు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు’ అని అన్నాడు. 

అంతేగాక ఈ టోర్నీ మొత్తంలో అతడు చేసిన పరుగుల కంటే నిన్నటి మ్యాచ్ లో బౌలింగ్ చేసినప్పుడు ఎక్కువ పరుగులు ఇచ్చాడని  చోప్రా చెప్పాడు. 

సునీల్ నరైన్ ఆటే.. ఈ మ్యాచ్ కు హైలైట్ అని చోప్రా తెలిపాడు. ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించని ఫిచ్ పై కోహ్లి.. క్రిస్టియన్ ను బరిలోకి దించడం పెద్ద తప్పిదమని అన్నాడు. క్రిస్టియన్ కు బదులు మరొకరితో బౌలింగ్ వేయించి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. 

క్రిస్టియన్ బౌలింగ్  కారణంగా అద్భుతంగా బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్, చాహల్, హర్షల్ పటేల్ వంటి బౌలర్ల శ్రమ వృథా అయిందని చోప్రా వ్యాఖ్యానించాడు. 

click me!