Rohit Sharma Wife Ritika Sajdeh and Dhanashree Verma Controversy : ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ కోవిడ్ సమయంలో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. వాళ్లు పబ్లిక్ ఈవెంట్లలో, సోషల్ మీడియాలో మంచి జంటగా కనిపించారు. అయితే, పెళ్లయ్యాక మనస్పర్థలు వచ్చి ఏడాదికి పైగా విడిగా ఉన్నారు. పెళ్లి ఫోటోలు, కలిసి ఉన్న ఇతర ఫోటోలు షోషల్ మీడియా అకౌంట్ల నుంచి తీసేయడంతో విడాకుల పుకార్లు మొదలయ్యాయి.
Rohit Sharma Wife Ritika Sajdeh Dhanashree Verma Divorce sugar daddy Drama
ధనశ్రీ వర్మ గురించి రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఏమన్నారు?
యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మలు బాంద్రాలోని ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. చాహల్ ధనశ్రీ వర్మకు 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువ భరణం ఇచ్చారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అప్పటినుంచి ధనశ్రీ వర్మను సోషల్ మీడియాలో 'షుగర్ డాడీ' అని విమర్శించడం మొదలైంది.
Rohit Sharma Wife Ritika Sajdeh Dhanashree Verma Divorce sugar daddy Drama
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే, యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మను "షుగర్ డాడీ" అని లేబుల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ను లైక్ చేశాక నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. రోహిత్ భార్య చేసిన పని అభిమానుల్లో, విమర్శకుల్లో కొత్త చర్చకు దారితీసింది.
Rohit Sharma Wife Ritika Sajdeh Dhanashree Verma Divorce sugar daddy Drama
దీనికి సంబంధించిన పోస్ట్‌ను శుభంకర్ మిశ్రా తన Instagram పేజీలో షేర్ చేశారు. చాహల్ నుంచి రూ.4.75 కోట్ల భరణం తీసుకున్నందుకు ధనశ్రీని విమర్శించారు. విడాకుల తర్వాత డబ్బు తీసుకుంటుంటే, "స్వతంత్ర మహిళ" అని ఎలా అంటారని మిశ్రా ప్రశ్నించారు. దీనికి రితికా లైక్ కొట్టడంతో చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు.
Rohit Sharma Wife Ritika Sajdeh Dhanashree Verma Divorce sugar daddy Drama
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 2020లో పెళ్లి చేసుకున్నారు. 18 నెలలు విడిగా ఉన్నాక 2025లో విడిపోతున్నట్లు ప్రకటించారు. మార్చి 20, 2025న వచ్చిన విడాకుల ప్రక్రియలో పెద్ద మొత్తంలో భరణం ఉంది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ వివాదం మధ్యలో ధనశ్రీ తన 'దేఖా జీ దేఖా మైనే' మ్యూజిక్ వీడియోను పోస్ట్ చేసింది. ఇది మోసం, విషపూరిత సంబంధాల ను ప్రస్తావిస్తుంది. విడాకులపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, “గనా సునో పెహ్లే” (ముందు పాట వినండి) అని చెప్పింది. దీంతో అభిమానులు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఊహాగనాలు మొదలుపెట్టారు.