Mohammed Shami
మహ్మద్ షమీ : టీమిండియా కీలక బౌలర్ మహ్మద్ షమీ ఎంట్రీతో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది. బుల్లెట్ వేగంతో బంతులు విసిరే షమీ మ్యాచ్ స్వరూపాన్నే మలుపుతిప్పగల బౌలర్. మ్యాచ్ విన్నర్ గా నిలిచే సత్తా కలిగిన షమీని సన్ రైజర్స్ కు బాగా ఉపయోగపడతాడు. షమీ హైదరాబాద్ టీం లో చేరడం తెలుగు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
మహ్మద్ షమీ తనదైన రోజున అద్భుతాలు చేయగలడు. అతడు టీమిండియా ఎన్నో విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టిన షమీ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. అతడు ఈ సీజన్ లో రాణించాడంటే ఐపిఎల్ ట్రోఫీ సన్ రైజర్స్ దే.
Indian Premier League 2025
షేక్ పేట్ షమీ :
ఇలా హైదరాబాద్ టీంలో చేరగానే అలా షమీని తెలుగు ఫ్యాన్స్ అక్కున చేర్చుకున్నారు. అతడిని శంషాబాద్ షమీ, షేక్ పేట్ షమీ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇలా జట్టులో చేరితేనే ఇంతలా అభిమానిస్తే ఇక ఎస్ఆర్‌హెచ్ కు విజయాలు అందిస్తే షమీని నెత్తిమీద పెట్టుకుంటారు తెలుగు ఫ్యాన్స్.
ఇప్పటికే యావత్ ఇండియన్ ఫ్యాన్స్ తో శభాష్ అనిపించుకున్నారు షమీ. ఇప్పుడు తెలుగోళ్లతో కూడా శభాష్ అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడి అనుభవం, అద్బుతమైన బౌలింగ్ స్టైల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్లస్ కానున్నాయి. కమిన్స్ సారథ్యంలో షమీ రెచ్చిపోతే ప్రత్యర్థుల సంగతి అంతే... ఇదే ఫ్యాన్స్ కూడా కోరుకునేది. మరి టీమిండియాకు విజయాలు అందించినట్లే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కూడా షమీ విజయాలు అందిస్తారేమో చూడాలి.
Mohammed Shami
షమీ ఐపిఎల్ కెరీర్ ;
భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు షమీ. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇంతకాలం వివిధ జట్లలో ఆడిన అతడు తాజా సీజన్ లో సన్ రైజర్స్ లో చేరాడు. అతడి రాకతో హైదరాబాద్ బౌలింగ్ బలంగా మారింది.
ఇప్పటివరకు 111 ఐపిఎల్ మ్యాచులాడిన షమీ 128 వికెట్లు పడగొట్టాడు. అతడు అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ 4/11. 2023 ఐపిఎల్ లో 28 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు కూడా 2022 లో 20 వికెట్లు, 2021 లో 19 వికెట్లు, 2020 లో 20 వికెట్లు, 2019 లో 19 వికెట్లతో రాణించారు. మరి ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అతడు ఎలా రాణిస్తాడో చూడాలి.