పెళ్లికి ముందు విరాట్ కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?... రితికా కారణంగానే ఆ ఇద్దరి మధ్య...

Published : Dec 13, 2021, 10:13 AM IST

సౌతాఫ్రికా టూర్‌కి ముందు వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను ప్రకటించడం, బలవంతంగా విరాట్ కోహ్లీని ఆ బాధ్యతల నుంచి తప్పించారని వార్తలు రావడంతో మరోసారి ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఓ మినీ యుద్ధమే నడుస్తోంది... 

PREV
111
పెళ్లికి ముందు విరాట్ కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?... రితికా కారణంగానే ఆ ఇద్దరి మధ్య...

రోహిత్‌కి ఈరోజు చాలా స్పెషల్. రితికా శర్మను పెళ్లాడింది ఈరోజే కాగా, మ్యారేజ్ డే గిఫ్ట్‌గా వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ కూడా బాదాడు రోహిత్. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భార్య రితికా శర్మతో డేటింగ్ చేశాడనే విషయం తెలుసా?

211

2019 వన్డే వరల్డ్‌కప్‌కి ముందునుంచే విరాట్ కోహ్లీ, రోహిత్ మధ్య మనస్పర్థలు ఉన్నాయని చర్చ నడించింది. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలను అన్‌ఫాలో అవ్వడంతోనే ఈ చర్చ మొదలైంది. 

311

ఈ గొడవలకు రోహిత్ శర్మ భార్య రితికా సాజ్దే, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మధ్య వచ్చిన మనస్పర్థలే కారణమనేవారూ లేకపోలేదు. ఈ ఇద్దరూ ఎడమొహం, పెడమొహం ఉండడమే ఈ రూమర్లకి ప్రధాన కారణం.

411

అయితే ఇవన్నీ పక్కనబెడితే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లాడక ముందు కొందరు హీరోయిన్లు, మోడళ్లతో డేటింగ్ చేసిన విరాట్ కోహ్లీ... రోహిత్ శర్మ భార్య రితికా సాజ్దేతో కూడా కొన్నాళ్లు డేటింగ్ చేశాడని వార్తలు వచ్చాయి.

511

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రితికా శర్మతో కలిసి ముంబైలో ఓ సినిమా థియేటర్‌లో మూవీ చూడడానికి వెళ్లాడు విరాట్ కోహ్లీ. 2013లో జింబాబ్వే టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ, ఓ అమ్మాయితో కలిసి ముంబయిలో తిరుగుతూ కనిపించాడు. ఆమెనే రితికా సాజ్దే.

611

ముంబైలో స్పోర్ట్స్ టాలెంట్ మేనేజర్‌గా పనిచేసిన రితికా సాజ్దే, విరాట్ కోహ్లీతో కలిసి ఓ సినిమాకి వెళ్లింది. అక్కడ ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టి ఫోటోలు తీయడంతో ఇబ్బంది పడింది రితికా. తన చేతికి ముఖానికి అడ్డుగా పెట్టుకుంది.

711

2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో రితికా సాజ్దేకి, విరాట్ కోహ్లీకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు విరాట్ కోహ్లీకి మేనేజర్‌గా పనిచేసింది రితికా.

811

అయితే రితికా సాజ్దే, తనకి మధ్య ఏమీ లేదని, తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మతో కలిసి మేనేజర్‌గా వ్యవహారించిన రితికా, అతని ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.

911

2015, డిసెంబర్ 13న రితికా, రోహిత్ శర్మ పెళ్లి చేసుకుని ఒక్కటి కాగా... రెండేళ్ల తర్వాత 2017, డిసెంబర్ 11న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లాడాడు విరాట్ కోహ్లీ.
 

1011

రితికా సాజ్దే, కూతురు సమైరా రోహిత్ శర్మకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రితికా, రోహిత్ శర్మ జోడి తమ అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన ప్రతీ మూమెంట్‌లో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు...

1111

అయితే ఈ ఇద్దరికీ భిన్నంగా ఆలోచించే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కూతురు వామిక ముఖాన్ని కూడా సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories