రోహిత్-విరాట్ మ‌ళ్లీ విఫ‌లం.. రిటైర్ అయిపోతారా?

First Published | Dec 17, 2024, 11:53 AM IST

Rohit Sharma-Virat Kohli: గ‌త కొన్నిఇన్నింగ్స్ ల నుంచి భార‌త సీనియ‌ర్ స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ఫామ్ లేమితో ఇబ్బంది ప‌డుతున్నారు. దీంతో వీరిద్ద‌రూ 'రిటైర్ అయిపోండి' అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. 
 

Rohit Sharma, Virat Kohli

Rohit Sharma-Virat Kohli: టెస్టు క్రికెట్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్ద‌రూ విఫలమయ్యారు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ రోహిత్‌ను పెవిలియ‌న్ కు పంపాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. 27 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి హిట్‌మన్ ఔటయ్యాడు. అలాగే, విరాట్ కోహ్లీ 3 ప‌రుగుల వ‌ద్ద హెజిల్ వుడ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు వీరిద్ద‌రిపై సోషల్ మీడియాలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. టెస్టుల నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు.

Rohit Sharma, Virat Kohli,

రోహిత్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్ర విమ‌ర్శ‌లు

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ భారత కెప్టెన్‌పై విమర్శలు చేస్తూ పిరికివాడని ఘాటు కామెంట్స్ చేశాడు. అత‌ను స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ.. "పాట్ కమిన్స్ అద్భుతంగా ఆడాడు. రోహిత్ శర్మ వ‌ద్ద అలాంటి సమాధానం లేదు. అతను చాలా పిరికివాడు. అతను వేరొక రకమైన బంతిని ఆశించాడు, కానీ అతను రోహిత్ షాట్ ఎంపికను చూసి ఆశ్చర్యపోయిన‌ట్టు" తెలిపాడు. "భారత్ తమ కెప్టెన్ నుండి చాలా అంచనాలు ఉన్నాయి. మెల్‌బోర్న్‌లో స్కోర్‌లైన్‌ను 1-1 వద్ద ఉంచడానికి జట్టుకు 200 పరుగులు అవసరం. ఈ పరుగులలో రోహిత్ 40 శాతం స్కోర్ చేసి ఉండాలని" అన్నాడు. 

Tap to resize

Rohit Sharma-Virat Kohli Test

దారుణ ఫామ్ లో రోహిత్ శ‌ర్మ 

సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఆడని రోహిత్ శ‌ర్మ‌.. అడిలైడ్ ఓవల్‌లో జరిగిన రెండో టెస్టులో రోహిత్ 3, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు 10 పరుగులు చేసి అవుటయ్యాడు. గత 13 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. ఆ ఇన్నింగ్స్ ల‌లో స్కోర్లు 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10 ప‌రుగులు, 2024 సీజన్‌లో రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో సగటు 8.85 మాత్రమే.

Rohit Sharma, Virat Kohli

విరాట్ కోహ్లీ వ‌రుస వైఫ‌ల్యాలు 

గ‌త కొన్ని ఇన్నింగ్స్ ల నుంచి విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు రావ‌డం లేదు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో పెర్త్‌లో జరిగిన ఓపెనింగ్ టెస్ట్‌లో కేవలం 5 పరుగులు చేసిన తర్వాత, అతను రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీని సాధించాడు. ఆ త‌ర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో మళ్లీ ఫ్లాప్ షో చూపించాడు. రెండు ఇన్నింగ్స్ ల‌లో వ‌రుస‌గా  7, 11 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. బ్రిస్బేన్ గ‌బ్బా టెస్టులో 3 ప‌రుగులతో తొలి ఇన్నింగ్స్ ను పూర్తి చేశాడు. 

2024లో టెస్టుల్లో కోహ్లి చేసిన 15 అవుట్లలో 12 ఆఫ్ స్టంప్ వెలుపల డెలివరీలు చేసినవే. ఆ 12 అవుట్‌లలో ఆరు అతను ఫ్రంట్ ఫుట్ నుండి డెలివరీలు ఆడాలని చూస్తున్నప్పుడు జరిగాయి. ఇప్పుడు కోహ్లీ టెక్నిక్ లు  మార్చ‌ల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని మాజీ క్రికెట‌ర్లు పేర్కొంటున్నారు.

Rohit Sharma-Virat Kohli

టెస్టుల్లో విరాట్ కోహ్లీ గ్రాఫ్ పడిపోతోంది

టెస్టుల్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ గ్రాఫ్ పడిపోతున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ సెంచరీలకు దగ్గరగా ఎవరూ లేరు, కానీ టెస్టుల్లో ఫ్యాబ్-4 జాబితాలో కోహ్లీ అట్టడుగు స్థానంలో ఉన్నాడు. పెర్త్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసినప్పటికీ, కోహ్లి టెస్టుల్లో అతని పేరు మీద ఇప్పటికీ 30 సెంచరీలు ఉన్నాయి, ఇది ఈ జాబితాలో అత్యల్పంగా ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ లిస్టులోని ప్లేయర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ లతో అదరగొడుతుండగా, విరాట్ కోహ్లీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు.

Latest Videos

click me!