చ‌రిత్ర సృష్టించిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అత్య‌ధిక సార్లు గెలుచుకున్న జ‌ట్టు ఏదో తెలుసా?

First Published | Dec 16, 2024, 8:03 PM IST

SMAT Final 2024 Highlights: ముంబై రెండో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 టైటిల్ గెలుచుకుంది. దీంతో మొత్తంగా రెండో టైటిల్ ను సాధించింది. 
 

Syed Mushtaq Ali Trophy 2024, ShreyasIyer

Syed Mushtaq Ali Trophy 2024: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ ముంబై vs మధ్యప్రదేశ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై రెండో టైటిల్ గెలుచుకుంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ముంబై నిలకడగా రాణిస్తూ.. సెమీస్‌లో బరోడాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైన‌ల్లో అద్భుత‌మైన ఆట‌తో విజ‌యం సాధించి స్మాట్ లో రెండో టైటిల్ ను సాధించింది. 

rajat patidar

రజత్ పాటిదార్ సూప‌ర్ ఇన్నింగ్స్ 

ఫైన‌ల్ మ్యాచ్ లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున ఆడుతున్న యంగ్ ప్లేయ‌ర్ రజత్ పాటిదార్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. అత‌ను 40 బంతుల్లో 81 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఎంపీకి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. కానీ అతని ఇన్నింగ్స్ వృథా అయింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ బౌల‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. ముంబై ఆట‌గాళ్ల‌ను అడ్డుకోవ‌డంలో విఫ‌లం కావ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

Tap to resize

Surya Kumar Yadav

తొలుత బ్యాటింగ్ చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ 20 ఓవర్లలో 174/8 పరుగులు చేసింది. ర‌జ‌త్ పాటిదార్‌ మినహా మరే బ్యాట్స్‌మెన్‌ కూడా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. స్టార్ బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ కూడా పెద్దగా ఇన్నింగ్స్ ఆడలేదు. 9 బంతుల్లో 17 పరుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. హర్‌ప్రీత్ సింగ్ భాటియా 23 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియ‌న్ కు చేరాడు. మిగ‌తా ఆట‌గాళ్లు కూడా పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ 200 మార్కును అందుకోలేక‌పోయింది. 

Syed Mushtaq Ali Trophy 2024, ShreyasIyer

చరిత్ర సృష్టించిన ముంబై టీమ్ 

స‌య్య‌ద్ ముస్త‌క్ అలీ టోర్నీ 2024 లో ముంబై జ‌ట్టు ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేసింది. పలువురు స్టార్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండ‌టం క‌లిసివ‌చ్చింది. పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే వంటి దిగ్గజ ఆటగాళ్లు ఫైనల్లో ముంబై జ‌ట్టులో ఉన్నారు. దీంతో ముంబై కేవలం 17.5 ఓవర్లలో 180/5 పరుగులు చేసి విజయం సాధించింది. ముంబై తరఫున ఓపెనర్ పృథ్వీ షా 6 బంతుల్లో 10 పరుగులు, అజింక్యా రహానే 30 బంతుల్లో 37 పరుగులు చేశారు. అలాగే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఇక స్టార్ బ్యాట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ ముంబై తరఫున టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.  35 బంతుల్లో 48 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, సూర్యాంశ్ షెడ్గే 15 బంతుల్లో 36 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ముంబైని విజ‌య‌తీరాల‌కు చేర్చారు.

Mumbai Cricket

దేశ‌వాళీ క్రికెట్ లో ముంబై ఆధిపత్యం

దేశవాళీ టోర్నీల్లో ముంబై ఆధిపత్యం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. టెస్టు, వన్డే, టీ-20 ఫార్మాట్లలో ముంబై ప్రతిచోటా తన జెండాను బ‌లంగా పాతుతోంది. ఇప్పటి వరకు ముంబై 42 సార్లు రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. 15 సార్లు ఇరానీ కప్ టైటిల్‌, 4 సార్లు విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని రెండు సార్లు గెలుచుకుంది. 

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న జట్లు:

1) తమిళనాడు - 3: 2006/07, 2020/21, 2021/22

2) ముంబై - 2: 2022/23, 2024

3) బరోడా - 2: 2011/12, 2013/14

4) గుజరాత్ - 2: 2012/13, 2014/15

5) కర్ణాటక - 2: 2018/19, 2019/20

Ajinkya Rahane

స్మాట్-2024-25లో అజింక్య రహానే సూప‌ర్ షో.. 

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో అజింక్య రహానే అద్భుత‌మైన ఆట‌తో అద‌రగొట్టాడు. దుమ్మురేపే ఇన్నింగ్స్ ల‌తో ప్ర‌త్య‌ర్థి బౌలింగ్ ను చీల్చిచెండాడాడు. స్మాట్ 2024 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. ఆడిన 9 మ్యాచ్‌లలో 58.62 సగటుతో 469 పరుగులు చేశాడు, ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వ‌రుస‌గా మూడు సార్లు సెంచ‌రీ చేసే అవ‌కాశం కోల్పోయాడు. ఇక చండీగఢ్ బౌలర్ జగ్జిత్ సింగ్ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించి 7 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు.

Latest Videos

click me!