తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కి భారీ ఆధిక్యం ఇచ్చి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను కాపాడేందుకు తనవంతు బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ, ఎంతో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాడు...
156 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అవుట్ అయ్యాడు.
రాబిన్‌సన్ బౌలింగ్‌లో షాట్ మిస్ అయిన రోహిత్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యినట్టు ప్రకటించాడు అంపైర్. వెంటనే డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్నాడు రోహిత్ శర్మ...
రిప్లైలో బంతి, వికెట్లను మిస్ అవుతున్నట్టుగా స్పష్టంగా కనిపించింది. అయితే అంపైర్ కాల్స్‌గా నిర్ణయించిన థర్డ్ అంపైర్, ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్నే ఫైనల్‌గా ప్రకటించాడు. దీనిపై దుమారం రేగింది...
అంపైర్స్ కాల్ అంటే బంతి, వికెట్లను కనీసం ఎడ్జ్‌లో అయినా తాకాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఊహాత్మకంగా బంతి గమనాన్ని అంచనా వేసే టెక్నాలజీ కంటే ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి విలువనిచ్చి... అంపైర్ కాల్‌గా ప్రకటిస్తారు.
అయితే వికెట్ల అంచును కూడా తాకనప్పుడు అంపైర్ కాల్‌గా ఎందుకు ప్రకటించారంటూ... ఇంగ్లాండ్ జట్టు సిరీస్ సమం చేసేందుకు ఛీటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోల్స్ మొదలయ్యాయి...
అంతకుముందు జో రూట్ డీఆర్‌ఎస్ తీసుకోవడానికి లేట్ చేయడంలో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ, కాస్త ఆలస్యంగానైనా ఇలా అవుట్ అయ్యాడని, ఇందులో ఛీటింగ్ ఏముందని అంటున్నారు ఇంగ్లాండ్ ఫ్యాన్స్...