అతనితో ఆడితే రనౌట్ అయిపోతా! ధోనీ కామెంట్స్ వైరల్... ఇంజమామ్‌ వంక పెట్టుకుని రోహిత్‌నే అన్నాడంటూ...

First Published Sep 24, 2022, 9:29 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ... బెస్ట్ ఫినిషర్, బెస్ట్ వికెట్ కీపర్, బెస్ట్ కెప్టెన్ మాత్రమే కాదు... అంతకుమించి బెస్ట్ రన్నర్ కూడా. వికెట్ల మధ్య ఎమ్మెస్ ధోనీ పరుగెత్తే స్పీడ్ మామూలుగా ఉండదు. ఓ రనౌట్‌తో అంతర్జాతీయ కెరీర్‌ని ఆరంభించి, రనౌట్‌తోనే ముగింపు పలికిన మాహీ... ఆ రెండింటి మధ్య కొన్ని వేల మైళ్లు పరుగులు తీశాడు...

టీమిండియా ఫిట్టెస్ట్ క్రికెటర్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ కూడా మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి వికెట్ల మధ్య పరుగెత్తేతప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఓ మ్యాచ్ సందర్భంగా ట్వీట్ చేశాడు. హెలికాఫ్టర్ సిక్సర్లు మాత్రమే కాదు, సింగిల్స్‌ని డబుల్స్‌గా, డబుల్స్‌ని త్రిబుల్స్‌గా మారుస్తూ వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగెత్తే మాహీ... తన తోటి క్రికెటర్ల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...

‘నేను ఇంజామామ్ భాయ్‌తో రన్నింగ్ చేస్తుంటే... నా వేగాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నేను స్పీడ్ తగ్గించుకోకపోతే కచ్ఛితంగా నూటికి నూరుశాతం రనౌట్ జరుగుతుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు మహేంద్ర సింగ్ ధోనీ.

పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ భారీ ఖాయంతో బారడేసి పొట్టతో ఉండేవాడు. బాగా బద్ధకస్తుండిగా పేరొందిన ఇంజమామ్ వుల్ హక్, ఎక్కువగా బౌండరీలు కొట్టడానికే ప్రాధాన్యం ఇచ్చేవాడు. సింగిల్స్ తీసినా డబుల్స్, త్రిబుల్స్ జోలికి మాత్రం వెళ్లేవాడు కాదు...

ఇంజమామ్ వుల్ హక్‌ పేరు చెప్పినప్పటికీ ఎమ్మెస్ ధోనీ పరోక్షంగా ఫిట్‌గా లేని రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి భారత క్రికెటర్ల గురించి ఈ వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు నెటిజన్లు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్ కూడా ఈ లిస్టులో వస్తాడని అంటున్నారు.

Dhoni

‘నాకు టీమ్ మీటింగ్స్ పెద్దగా నచ్చవు. అందుకే మీటింగ్స్‌కి వెళ్లను, వెళ్లినా సాధ్యమైనంత తక్కువ సేపు మీటింగ్స్‌లో గడుపుతాను. షార్టెస్ట్ టీమ్ మీటింగ్ అంటే సీఎస్‌కే తరుపునే. అది ఒక్క నిమిషంలోపే ముగిసింది. ఒక్క నిమిషంలో మీటింగ్ ఎలా అయిపోయిందని మీరు అనుకోవచ్చు...

అది సాయంత్రం 5:30కి మీటింగ్ అనుకున్నాం. అందరు ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా 5:28కే మీటింగ్ రూమ్‌కి చేరుకున్నారు. అందరూ వచ్చేశారని 5:29కి మీటింగ్ స్టార్ట్ చేశాం. అంతే 5:30కి మీటింగ్ అయిపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ... 

click me!