Rohit Sharma: రాహుల్ ద్ర‌విడ్ ను అధిగ‌మించిన రోహిత్ శ‌ర్మ

Published : Feb 09, 2025, 11:20 PM IST

India vs England: రోహిత్ శ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీ, గిల్ హాఫ్ సెంచ‌రీల‌తో రెండో వ‌న్డేలో కూడా ఇంగ్లాండ్ పై టీమిండియా విక్ట‌రీ అందుకుంది. ఈ క్ర‌మంలోనే భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ లెజెండ‌రీ ప్లేయ‌ర్ రాహుల్ ద్ర‌విడ్ ను అధిగ‌మించి మ‌రో మైలురాయిని అందుకున్నాడు.   

PREV
16
Rohit Sharma: రాహుల్ ద్ర‌విడ్ ను అధిగ‌మించిన రోహిత్ శ‌ర్మ
Rohit Sharma, Rahul Dravid

India vs England: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన భార‌త్-ఇంగ్లాండ్ రెండో వ‌న్డేలో భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. దీంతో భారత్ మ‌రో విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు  బెన్ డకెట్, జో రూట్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లతో  49.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది.

భారత్ తరఫున రవీంద్ర జడేజా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 305 ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భార‌త్ కు రోహిత్ శర్మ సెంచరీ, గిల్ హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ల‌తో భార‌త్ 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి ఇంగ్లాండ్ విక్ట‌రీని అందుకుంది. దీంతో భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ ను కైవసం చేసుకుంది. 

26
Rohit Sharma

రోహిత్ శ‌ర్మ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్.. కెరీర్ లో 32వ సెంచ‌రీ సాధించాడు

ఆదివారం (ఫిబ్రవరి 9న) కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌ల్లో 31 పరుగులు చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తన బ్యాట్ తో విమర్శకులకు సమాధానమిచ్చాడు. 

ఇంగ్లాండ్ తో ప్రస్తుత వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్‌లో  రోహిత్ కేవలం రెండు పరుగులకే ఔటయ్యాడు కానీ రెండవ మ్యాచ్‌లో తన 32వ వన్డే సెంచరీని సాధించాడు. తన ఫామ్ ను అందుకుంటూ 76 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు. మొత్తంగా 119 పరుగుల తన ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.

36
rohit sharma's bat roared in cuttack, hit the 32nd century of his odi career

రాహుల్ ద్రవిడ్ ను దాటేసిన రోహిత్ శర్మ 

ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ తో భార‌త లెజెండరీ ప్లేయ‌ర్, టీమిండియా మాజీ ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ను దాటేసి మ‌రో మైలురాయిని అందుకున్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శ‌ర్మ ఇప్పుడు రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించాడు. మూడు ఫార్మాట్లలో రోహిత్ చేసిన 49వ సెంచరీ ఇది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 

46

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత టాప్-5 ప్లేయ‌ర్లు వీరే: 

1 - సచిన్ టెండూల్కర్: 664 మ్యాచ్‌ల్లో 100 సెంచరీలు

2 - విరాట్ కోహ్లీ: 543 మ్యాచ్‌ల్లో 81 సెంచరీలు

3 - రోహిత్ శర్మ: 493 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు

4 - రాహుల్ ద్రవిడ్: 509 మ్యాచ్‌ల్లో 48 సెంచరీలు

5 - వీరేంద్ర సెహ్వాగ్: 374 మ్యాచ్‌ల్లో 38 సెంచరీలు

56

భార‌త వ‌న్డే క్రికెట్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన నాల్గో ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ 

భారత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మరో రికార్డును కూడా అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భార‌త ఆట‌గాళ్ల లిస్టులో రాహుల్ ద్ర‌విడ్ ను అధిగ‌మించాడు. ద్రవిడ్ 344 మ్యాచ్‌ల్లో 10889 పరుగులు చేశాడు. రోహిత్ ద్రవిడ్‌ను అధిగమించడానికి 22 పరుగులు అవసరం కాగా, ఈ మ్యాచ్ లో సూప‌ర్ ఇన్నింగ్స్ తో ద్ర‌విడ్ ను దాటేశాడు. 

66
india vs england ODI

వన్డేల్లో భార‌త్ త‌ర‌ఫున‌ అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయ‌ర్లు వీరే:

1 - సచిన్ టెండూల్కర్: 463 మ్యాచ్‌ల్లో 18426 పరుగులు

2 - విరాట్ కోహ్లీ: 296 మ్యాచ్‌ల్లో 13911 పరుగులు

3 - సౌరవ్ గంగూలీ: 311 మ్యాచ్‌ల్లో 11363 పరుగులు

4 - రోహిత్ శర్మ: 267 మ్యాచ్‌ల్లో 10987 పరుగులు

5 - రాహుల్ ద్రవిడ్: 344 మ్యాచ్‌ల్లో 10889 పరుగులు

Read more Photos on
click me!

Recommended Stories