IND vs AUS: ఆ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాం.. అందుకే ఓడాం.. రోహిత్ కామెంట్స్

Published : Sep 21, 2022, 11:45 AM IST

IND vs AUS T20I: మొహాలీ మ్యాచ్ లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసినా ఓటమి  నుంచి తప్పించుకోలేకపోయింది. భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో మ్యాచ్ చేజారింది. 

PREV
17
IND vs AUS: ఆ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాం.. అందుకే ఓడాం.. రోహిత్ కామెంట్స్

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య  మొహాలీ వేదికగా ముగిసిన తొలి టీ20లో భారత ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యం. టీ20 జట్టుకు ఎంపికైన  భువనేశ్వర్,  హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, హార్ధిక్ పాండ్యా.. ఇలా ఒక్కరని కాదు..  నిన్నటి మ్యాచ్ లో  ఒక్క అక్షర్ పటేల్ తప్ప బౌలింగ్ వేసిన ఐదుగురు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

27

మ్యాచ్ అనంతరం రోహిత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాము ఈ మ్యాచ్ లో బౌలింగ్ సరిగా చేయలేదని కుండబద్దలు కొట్టాడు.  200 పరుగులు చేసినా తమ జట్టు బౌలర్లు దానిని కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

37

రోహిత్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో మేం సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం. మేం చేసిన 208 పరుగులు చాలా మంచి టార్గెట్. కానీ దానిని కూడా కాపాడుకోలేకపోయాం.  మా బ్యాటర్స్ చాలా బాగా ఆడారు . కానీ సరైన బౌలింగ్ లేకపోవడంతో మ్యాచ్ మా నుంచి చేజారింది. 

47
Bhuvneshwar Kumar

బౌలింగ్ తో పాటు మా ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉంది.  ఇవి రెండు  మ్యాచ్ లో మా ఓటమికి ప్రధాన కారణాలు. మా జట్టుకు కీలక బౌలర్లుగా ఉన్న భువనేశ్వర్ కుమార్, హార్షల్ పటేల్ లు ఈ మ్యాచ్ లో విఫలమవడం మమ్మల్ని బాగా దెబ్బతీసింది. అక్షర్ ఒక్కడు తన మ్యాజిక్ బౌలింగ్ తో మ్యాచ్ ను మా చేతుల్లోకి తీసుకొచ్చినా మేం కాపాడుకోలేకపోయాం. 
 

57
Image credit: PTI

ఆరో బౌలర్ సేవలు మాకు ఉన్నాయి. వచ్చే మ్యాచ్ లో లోపాలను సరి చేసుకుంటాం. ఇకనుంచి రాబోయే మ్యాచ్ లలో పొరపాట్లకు  తావివ్వకుండా జాగ్రత్త పడతాం..’ అని  చెప్పాడు. 
 

67
Harshal Patel

ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల పేలవ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్నారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్  4 ఓవర్లలో  52 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయకపోగా హర్షల్ పటేల్.. 4 ఓవర్లలో 49 పరుగులిచ్చాడు. ఉమేశ్ యాదవ్ రెండు ఓవర్లు వేసి  27 పరుగులు సమర్పించుకోగా.. చాహల్ కూడా 3.2 ఓవర్లలో 42 పరుగులిచ్చాడు.  ఒక్క అక్షర్ పటేల్ మాత్రం.. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

77

మ్యాచ్ విషయానికిస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.  హార్ధిక్ పాండ్యా (71 నాటౌట్), కెఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46) రాణించారు. అనంతరం ఆసీస్.. 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కామెరూన్ గ్రీన్ (61) వీరవిహారానికి తోడు మాథ్యూ వేడ్ (45) మెరుపులతో ఆసీస్ నే విజయం వరించింది. 

Read more Photos on
click me!

Recommended Stories