IND vs AUS: విరామమా..? కోలుకోలేదా..? ఫిట్‌గా లేనిది ఎందుకు ఎంపిక చేసినట్టు..? బుమ్రా ఆడకపోవడంపై అనుమానాలు

Published : Sep 20, 2022, 08:09 PM IST

Jasprit Bumrah: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు.  అతడు బెంచ్ కే పరిమితమయ్యాడు.   

PREV
17
IND vs AUS: విరామమా..? కోలుకోలేదా..?  ఫిట్‌గా లేనిది ఎందుకు ఎంపిక చేసినట్టు..? బుమ్రా ఆడకపోవడంపై అనుమానాలు

జులైలో ఇంగ్లాండ్ తో ముగసిన మూడు ఫార్మాట్ల  సిరీస్ తర్వాత  జస్ప్రీత్ బుమ్రా  భారత జట్టు తరఫున ఆడింది లేదు. కీలకమైన ఆసియా కప్ లో కూడా బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. టీ20 ప్రపంచకప్  ముందున్న నేపథ్యంలో అసలు అతడు ఈ మెగా టోర్నీ అయినా ఆడతాడా..? లేదా..? అనే అనుమానాలుండేవి. 

27

అయితే గత నెల రోజులుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిటేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న  బుమ్రా.. మెరుగయ్యాడని బీసీసీఐ తెలిపింది.కొద్దిరోజుల క్రితమే అతడితో పాటు హర్షల్ పటేల్ కు ఫిట్నెస్ టెస్టు కూడా నిర్వహించింది. 

37
Image credit: Getty

ఫిట్నెస్ టెస్ట్ పాసైన బుమ్రాను వచ్చే నెలలో ఆసీస్ లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసింది.  అంతకంటే ముందు అతడిని ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు కూడా  తీసుకుంది. ఈ సిరీస్ తో పాటు దక్షిణాఫ్రికా సిరీస్ లో బుమ్రాకు మంచి ప్రాక్టీస్ అవుతుందని.. అదీగాక అతడు ప్రపంచకప్ కు  ఏ మేరకు ఫిట్ గా ఉన్నాడనేదానిమీద కూడా స్పష్టత వస్తుందని బీసీసీఐ భావించింది. 

47

అయితే ఆస్ట్రేలియాతో మొహాలీలో జరుగుతున్న తొలి మ్యాచ్ లో మాత్రం బుమ్రాను ఆడించలేదు. టాస్ సమయంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ రిషభ్ పంత్ తో పాటు బుమ్రా  కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని తెలిపాడు. 
 

57

వచ్చే రెండు మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులో ఉంటాడని కూడా హిట్ మ్యాన్ చెప్పాడు. ఇక్కడే బుమ్రా ఫిట్నెస్ పై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఫిట్నెస్ టెస్టు సాధించిన తర్వాత కూడా  బుమ్రాకు మళ్లీ రెస్ట్ ఎందుకిచ్చినట్టు.?? అనేదానికి సమాధానం లేదు.

67

ఫిట్ గా లేనిది ఆదరాబాదరగా బుమ్రాను ఎంపిక చేశారా..? లేక నిజంగా అతడింకా మ్యాచ్  ఆడేందుకు ఫిట్ గా లేడా..? అనేది ప్రశ్నార్థకం.  టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో హడావిడిగా  జట్టును ప్రకటించి సెలక్టర్లు చేతులు దులుపుకున్నారా..? అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది.  

77

ఒకవేళ బుమ్రా రాబోయే రెండు మ్యాచ్ లలో కూడా ఆడకుంటే  మాత్రం  ఈ అనుమానాలు నిజం కాక మానవు అని టీమిండియా ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే టీ20 ప్రపంచకప్ లో కూడా బుమ్రా ఆడేది అనుమానమే..!

click me!

Recommended Stories