ఇకనైనా రోహిత్ శర్మ అన్ని మ్యాచులు ఆడాలి! కెప్టెన్ అయ్యుండి రెస్ట్ కావాలంటే... - అజిత్ అగార్కర్...

Published : Mar 15, 2023, 10:37 AM IST

2022 ఏడాదిలో టీమిండియాకి ఏదీ కలిసి రాలేదు. స్వదేశంలో వరుసగా ద్వైపాక్షిక సిరీసులు గెలిచిన టీమిండియా, ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 వంటి కీలక టోర్నీల్లో ఫెయిల్ అయ్యింది. మరీ ముఖ్యంగా పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్నాక ఏడాదిలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది...

PREV
18
ఇకనైనా రోహిత్ శర్మ అన్ని మ్యాచులు ఆడాలి! కెప్టెన్ అయ్యుండి రెస్ట్ కావాలంటే... - అజిత్ అగార్కర్...

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కారణాలు చెప్పి, టీమ్ నుంచి తప్పుకోవడం, బిజీ షెడ్యూల్ వంక చెప్పి రెస్ట్ తీసుకోవడంతో హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్.. ఇలా కెప్టెన్లను మారుస్తూ రావాల్సి వచ్చింది టీమిండియా. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో అలాంటి అవసరం రాలేదనే చెప్పాలి..

28

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత టీ20లకు హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా కొనసాగిస్తూ వస్తున్న బీసీసీఐ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లను పొట్టి ఫార్మాట్‌కి దూరంగా పెట్టింది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత రోహిత్ శర్మ కూడా వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది...

38
Rohit Sharma

‘రోహిత్ శర్మ రికార్డులు చూస్తే, అతను టీమిండియాకి ఎంత ముఖ్యమైన ప్లేయరో అర్థమవుతుంది. వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాపార్డర్‌లో రోహిత్ శర్మ ఉంటే,  ప్రత్యర్థి గుండెల్లో భయం మొదలైపోతుంది...

48

అయితే కెప్టెన్ అయ్యాక అతని ఆటతీరులో కొద్దిగా మార్పు వచ్చింది. నాగ్‌పూర్ టెస్టులో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తే, తాను సెంచరీ చేయాలని ఫిక్స్ అయి వచ్చినట్టు అనిపించింది. సమయం తీసుకుని, గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయి వచ్చినట్టు ఆడాడు...

58
Image credit: PTI

ఇకపై టీమిండియాకి ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ రావాలి. ఎందుకంటే వన్డేల్లో కూడా క్రీజులో కుదురుకోవడానికి కావాల్సినంత సమయం ఉంటుంది. కెప్టెన్‌ క్రీజులో ఉంటే మిగిలిన ప్లేయర్లకు ఫ్రీగా ఆడేందుకు అవకాశం పెరుగుతుంది...

68

గత ఏడాది వ్యక్తిగత కారణాలు చెప్పి చాలా వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. కెప్టెన్ అయ్యాక కూడా సాకులు చెప్పి మ్యాచుల నుంచి తప్పుకోవడం కరెక్ట్ కాదు. వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీకి పెద్దగా సమయం లేదు. ఇప్పటికైనా రోహిత్ శర్మ విలువైన సమయాన్ని కరెక్టుగా వాడుకోవాలి..

78
Rohit Sharma

ఇకపై ఇండియాలో ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ ఆడాలి. అప్పుడే టీమ్ కాంబినేషన్‌పై అతనికి స్పష్టమైన అవగాహన వస్తుంది. ఐపీఎల్ తర్వాత టీమిండియాకి పెద్దగా సమయం ఉండదు.  అందుకే కెప్టెన్‌ ఏ మ్యాచ్ మిస్ కాకుండా ఆడితే బెటర్...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్...

88
Image credit: PTI

అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టెస్టు సిరీస్‌ని ముగించిన రోహిత్ శర్మ, వ్యక్తిగత కారణాలతో మొదటి వన్డేకి దూరంగా ఉండబోతున్నాడు. ముంబైలో జరిగే తొలి వన్డేకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories