2007 టీ20 వరల్డ్ కప్ విజయం, డబుల్ సెంచరీ, సచిన్‌తో... రోహిత్ శర్మ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ మూమెంట్స్ ఇవే!

Published : Aug 06, 2023, 06:52 PM IST

14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ తర్వాత టీమిండియాకి కెప్టెన్సీ చేసే అవకాశం దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ అందుకున్న రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..

PREV
18
2007 టీ20 వరల్డ్ కప్ విజయం, డబుల్ సెంచరీ, సచిన్‌తో... రోహిత్ శర్మ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ మూమెంట్స్ ఇవే!

2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కావడంతో ఈసారి టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిత్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లకు ఇదే ఆఖరి వన్డే వరల్డ్ కప్ కూడా కావచ్చు..
 

28
Image Credit: Getty Images

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన రోహిత్ శర్మ, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అటు నుంచి యూఎస్‌‌ఏకి వెళ్లాడు. అమెరికాలో రోహిత్ శర్మ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన రోహిత్, తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ మూమెంట్స్‌పై కామెంట్ చేశాడు..

38

టీ20 వరల్డ్ కప్ 2007: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఎలాంటి అంచనాలు లేకుండా టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ ఆడింది టీమిండియా. ఇదే టోర్నీలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, ఫైనల్ మ్యాచ్‌లో 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు.. ఈ విజయాన్ని తన కెరీర్‌లో బెస్ట్ మూమెంట్‌గా చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

48

తొలి టెస్టు సెంచరీ: 2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వడానికి 2013 వరకూ వేచి చూడాల్సి వచ్చింది. సచిన్ టెండూల్కర్ ఫేర్‌వెల్ టెస్టు సిరీస్‌లోనే రోహిత్ శర్మ టెస్టు ఆరంగ్రేటం చేయడం విశేషం. వెస్టిండీస్‌తో కోల్‌కత్తాలో జరిగిన టెస్టులో 177 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్. ఇది తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్‌గా అభివర్ణించాడు రోహిత్ శర్మ..

58

২০১৪ সাল- ২৬৪, প্রতিপক্ষ- শ্রীলঙ্কা

శ్రీలంకపై చేసిన 264 పరుగులు: వన్డే క్రికెట్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన రోహిత్ శర్మ, శ్రీలంకతో జరిగిన వన్డేలో 264 పరుగులు చేసి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు బాదిన క్రికెటర్‌గానూ నిలిచాడు. కోల్‌కత్తాలో 2014, నవంబర్ 13న జరిగిన వన్డేలో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ కూడా తన క్రికెట్ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలుస్తుందని కామెంట్ చేశాడు రోహిత్ శర్మ..
 

68
sachin rohit

సచిన్ టెండూల్కర్‌తో సెంచరీ భాగస్వామ్యం: 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 123 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ. రాబిన్ ఊతప్ప 17, గౌతమ్ గంభీర్ 3, యువరాజ్ సింగ్ 10 పరుగులు చేసి అవుట్ కావడంతో 87 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 

78
sachin tendulkar rohit sharma

ఈ దశలో 87 బంతుల్లో 6 ఫోర్లతో 66 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 120 బంతుల్లో 117 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, అజేయ సెంచరీతో టీమిండియాకి విజయాన్ని అందించాడు.. తన క్రికెట్ గురువు సచిన్‌తో 100+ భాగస్వామ్యం నమోదు చేయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ..

88

గబ్బా టెస్టు విక్టరీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-2021 సిరీస్‌లో సీనియర్లు లేకుండా ఆస్ట్రేలియాని గబ్బాలో ఓడించింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన రోహిత్, రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే శుబ్‌మన్ గిల్ 91, ఛతేశ్వర్ పూజారా 56 రాణించి, రిషబ్ పంత్ 89 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాని గెలిపించాడు. ఈ విజయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ.. 

Read more Photos on
click me!

Recommended Stories