ప్రమాదంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ? జస్ప్రీత్ బుమ్రా హిట్‌మ్యాన్ కు ఝలక్ ఇస్తాడా?

Published : Dec 11, 2024, 12:02 AM IST

Rohit Sharma-Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్ పై సూప‌ర్ విక్ట‌రీతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని అద్భుతంగా ప్రారంభించింది భార‌త్. అయితే, రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో రెండో మ్యాచ్ ఆడిన టీమిండియా ఘోరంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.    

PREV
15
ప్రమాదంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ? జస్ప్రీత్ బుమ్రా హిట్‌మ్యాన్ కు ఝలక్ ఇస్తాడా?
Rohit Sharma, Jasprit Bumrah

Rohit Sharma-Jasprit Bumrah: అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఓటమి తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్ర‌స్తుతం అంద‌రికీ టార్గెట్ గా మారాడు. ఎందుకంటే అత‌ని నుంచి పెద్దగా ప‌రుగులు రావ‌డం లేదు. కెప్టెన్ గా అత‌ని వ్యూహాలు ప‌నిచేయ‌డం లేదు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్  చేతిలో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన తర్వాత, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో రోహిత్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే డే-నైట్ టెస్టులో రోహిత్ కెప్టెన్సీలో ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. దీంతో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో క్రికెట్ నిపుణులు రోహిత్ ముందు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

25

రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు

అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో కూడా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ ఉపయోగించుకోవడంపై భారత మాజీ బ్యాట్స్‌మెన్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్య‌క్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో, చోప్రా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీ గురించి ఒక అభిమాని అడిగినప్పుడు, చోప్రా వెంటనే అడిలైడ్‌లో హిట్‌మ్యాన్ తీసుకున్న పేలవమైన నిర్ణయాలను ఎత్తి చూపాడు.

35

ఆకాశ్ చోప్రా రోహిత్ గురించి ఏం చెప్పాడు?

ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, "జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్ల బౌలింగ్ వేసి అందులో ఒక వికెట్ తీశాడు. అప్పుడు అతను కేవలం నాలుగు ఓవర్లు ఎందుకు బౌలింగ్ చేసాడు? ఆ తర్వాత ఎందుకు బౌలింగ్ చేయలేదు? అతను మొత్తం సీజన్లో బౌలింగ్ చేయలేదు. అందుకే మీరు కెప్టెన్సీలో 100 శాతం సరైనదా?  కాదా అనేది చెప్పాలంటూ" కామెంట్స్ చేశాడు. 

45

వ‌రుస ప‌రాజ‌యాలు.. రోహిత్ చెత్త రికార్డు 

అకాశ్ చోప్రా ఇంకా మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక వ‌రుస ప‌రాజ‌యాల లిస్టును కూడా ప్ర‌స్తావించాడు. భారత కెప్టెన్‌లో అత్యధిక వరుస పరాజయాలు గ‌మ‌నిస్తే..1967లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 1999లో సచిన్ టెండూల్కర్ తర్వాత MS ధోనీ వరుసగా నాలుగు మ్యాచ్‌లను రెండుసార్లు ఓడిపోయాడు. ఇక‌ విరాట్ కోహ్లీ 2020-21లో వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయాడు. ఇప్పుడు రోహిత్ శర్మ ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయి ఈ చెత్త రికార్డులో చేరాడు. 

55

రోహిత్ కెప్టెన్సీ కాస్త తక్కువగానే ఉంది

మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ, “పెర్త్ మ్యాచ్‌లో అతను కెప్టెన్ కాదు. అందువల్ల ఆ విజయం అతనికి పట్టింపు లేదు. గ‌త కెప్టెన్ల‌ ప్ర‌ద‌ర్శ‌న‌లు గ‌మ‌నిస్తే.. ఇందులో ధోనీ, కోహ్లి, రోహిత్ లు వ‌రుస‌గా భార‌త టెస్టు క్రికెట్ లో చెత్త రికార్డుల‌ను త‌మ పేరుమీద రాసుకున్నారు. ఇది అతి పెద్ద ఆందోళన.. స్వదేశంలో వరుసగా మూడు పరాజయాలు అంటే.. రోహిత్ కెప్టెన్సీ కాస్త త‌గ్గింద‌ని అర్థ‌మ‌వుతోందని" కామెంట్స్ చేశాడు. కాగా, బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories