సిరాజ్ కు సారీ చెప్పిన రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్ - ఏం జ‌రిగిందంటే?

First Published | Sep 20, 2024, 11:01 PM IST

Rohit , Pant apologise to Siraj: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఇప్ప‌టివ‌రకు భార‌త్ ఆధిప‌త్యం చెలాయించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్ ను 149 ప‌రుగుల‌కే ప‌రిమితం చేసింది టీమిండియా. 
 

Rohit Sharma, Rishabh pant, siraj

Rohit Sharma, Rishabh Pant apologise to Mohammed Siraj : చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఉత్కంఠతో పాటు యాక్షన్ కొన‌సాగింది. మంచి ఓవర్‌నైట్ స్కోరుతో ఆట‌ను ప్రారంభించిన భార‌త జ‌ట్టు కేవలం 27 పరుగులకే తమ చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. దీంతో భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌల‌ర్ల‌లో హసన్ మహమూద్ వరుసగా ఐదు వికెట్లు పడగొట్టగా, తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లతో రాణించాడు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటను టీమిండియా అద్భుతంగా ప్రారంభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత కూడా భారత్ వైపు నుంచి అద్భుతమైన బౌలింగ్ కనిపించింది. బుమ్రా నిప్పులు చెరిగే బౌలింగ్ కు తోడుగా, మ‌హ్మ‌ద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ర‌వీంద్ర‌జ‌డేజాలు రాణించ‌డంలో బంగ్లాదేశ్ టీమ్ 149 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 

అయితే, ఈ మ్యాచ్ మధ్యలో వికెట్ కీపింగ్ చేస్తున్న రిషబ్ పంత్‌పై సిరాజ్ కోపంగా కనిపించాడు. రిషబ్ పంత్ కారణంగా సిరాజ్ ఒక వికెట్ ను కూడా కోల్పోయాడు. ఇందులో రోహిత్ శ‌ర్మ కూడా పాలుపంచుకున్నాడు. దీంతో చివ‌ర‌కు రోహిత్, పంత్ లు సిరాజ్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 


రెండో రోజు తొలి ఓవర్‌లోనే బుమ్రా టీమిండియాకు అద్భుత‌మైన ఆరంభం అందించాడు. బంగ్లాదేశ్ ఓపెన‌ర్ షాద్మాన్ ఇస్లాం మొద‌టి ఓవ‌ర్ లోనే పెవిలియ‌న్ కు పంపాడు. ఆ త‌ర్వాత కూడా త‌న బౌలింగ్ ప‌దును చూపిస్తూ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో అంత‌ర్జాతీ క్రికెట్ లో 400 వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ గా దిగ్గ‌జ బౌల‌ర్ల స‌ర‌స‌న చేరాడు. 

బుమ్రాకు తోడుగా మరో ఎండ్‌ నుంచి మ‌హ్మ‌ద్ సిరాజ్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు.  బౌలింగ్‌ చేస్తున్న సిరాజ్ కు బంగ్లాదేశ్ స్కోరు 8 వద్ద కూడా వికెట్‌ పడగొట్టే అవకాశం ఉంది. కానీ పంత్ కారణంగా ఈ వికెట్ సిరాజ్ తీయలేకపోయాడు. నాలుగో ఓవర్లో సిరాజ్ బౌలింగ్ చేస్తుండగా జకీర్ హసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అద్భుత‌మైన  డెలివ‌రీతో హ‌స‌న్ ను దెబ్బ‌కొట్టాడు సిరాజ్. 

Mohammed Siraj

ఎల్‌బిడబ్ల్యు కోసం బలమైన అప్పీల్ చేశాడు. అయితే మైదానంలోని అంపైర్ నాటౌట్‌గా సంకేతాలిచ్చాడు.  ఆన్ ఫీల్డ్ అంపైర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో రివ్యూ కోసం సిరాజ్ చేసిన విజ్ఞప్తిని కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప‌ట్టించుకోలేదు. బదులుగా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ మాట విన్నాడు. రివ్యూ తీసుకోవడానికి పంత్ నిరాకరించాడు. 

రిషబ్ పంత్ వికెట్లు కీపింగ్ చేస్తున్నాడు, కానీ అతను బంతిని చూడ‌టంలో పొరబడ్డాడు. కెప్టెన్ రోహిత్ శర్మపై రివ్యూ తీసుకోవడానికి అతను నిరాకరించాడు. లెంగ్త్ లేదని, బంతి లెగ్ సైడ్ గుండా వెళుతుందని పంత్ చెప్పడంతో కెప్టెన్ రోహిత్ రివ్యూ తీసుకోలేదు. కానీ ఆ బాల్ ను రిప్లేలో స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై చూపించినప్పుడు అది వికెట్ల‌ను తాకిన‌ట్టు వెళ్లింది. రివ్యూ తీసుకోక‌పోవ‌డంతో సిరాజ్ ఒక వికెట్ ను కోల్పోయాడు. అయితే, భార‌త జ‌ట్టుకు మాత్రం న‌ష్టం జ‌ర‌గ‌లేదు. త‌ర్వాతి ఓవ‌ర్ లోనే ఆకాశ్ దీప్ అత‌న్ని ఔట్ చేశాడు. 

ఈ బాల్ రివ్యూ బిగ్ స్క్రీన్ పై క‌నిపించిన త‌ర్వాత సిరాజ్ పంత్‌పై కోపంగా కనిపించాడు. అయితే, రోహిత్ శ‌ర్మ సిరాజ్ కు క్షమాపణలు చెప్పాలని పంత్ కు  సైగ‌లు చేశాడు. ఈ వీడియో దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

కాగా, ఈ మ్యాచ్ రెండో రోజు భారత్ నుంచి అద్భుత బౌలింగ్ కనిపించింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీయగా, సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ కేవలం 149 పరుగుల వద్ద ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, య‌శ‌స్వి  జైస్వాల్, విరాట్ కోహ్లీలు పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ‌కుండానే పెవిలియ‌న్ కు చేరారు. 

Latest Videos

click me!