ఉఫ్, ఇంత హాట్‌గా ఉంటే తట్టుకోవడం కష్టమే... అనుష్క శర్మ ఫోటోపై విరాట్ కోహ్లీ కామెంట్...

Published : Apr 03, 2022, 06:10 PM IST

ఇండియాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ఓ యాడ్ షూట్‌లో కలిసిన ఈ ఇద్దరూ... ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత తిరిగి తాజాగా మరోసారి ఓ యాడ్‌లో కలిసి నటించారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ...  

PREV
18
ఉఫ్, ఇంత హాట్‌గా ఉంటే తట్టుకోవడం కష్టమే... అనుష్క శర్మ ఫోటోపై విరాట్ కోహ్లీ కామెంట్...

తల్లైన తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మ, తాజాగా భర్త విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది...

28

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి చేసిన ఓ ఫోటోషూట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బాలీవుడ్ హీరోయిన్, ‘మేం బాగా శుభ్రం చేశాం...’ అంటూ కాప్షన్ జోడించింది...

38
Image Credit: Anushka Sharma Instagram

ఈ ఫోటోలకు ‘ఉఫ్... టూ హాట్... ’ అంటూ కామెంట్ చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మను ట్యాగ్ చేశాడు. ఇద్దరూ సూపర్ హాట్ సెలబ్రిటీలు, హాట్ ఫోజులు పెడితే, తట్టుకోవడం కష్టమే అంటున్నారు సోషల్ మీడియా జనాలు...

48

దాదాపు మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న అనుష్క శర్మ... మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే...

58

ఐపీఎల్ 2022 సీజన్‌లో  విరాట్ కోహ్లీ బిజీ బిజీగా గడుపుతుంటే, సినిమా షూటింగ్లతో అనుష్క శర్మ కూడా బిజీ అయిపోయింది. అయితే ఈ ఇద్దరూ కూతురు వామిక కోహ్లీ కోసం సమయం కేటాయిస్తున్నారు...

68

క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... దాదాపు 9 సీజన్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగుతున్నాడు... 

78

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే ఆఖరి సీజన్ అని ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేశాడు విరాట్ కోహ్లీ... 

88

ఐపీఎల్ 2022 సీజన్‌కి గానూ రూ.15 కోట్లు తీసుకుంటున్న విరాట్ కోహ్లీ, కెప్టెన్ కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్న ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్‌ని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది బెంగళూరు...

Read more Photos on
click me!

Recommended Stories