టీమిండియాకి ఏది మంచిదో దాదాకి బాగా తెలుసు... బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి పెరుగుతున్న...

First Published Dec 17, 2021, 10:09 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత జరుగుతున్న పరిణామాలు, సగటు టీమిండియా ఫ్యాన్‌ని కలవరపెడుతున్నాయి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పిస్తూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది...

విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని స్వయంగా కోరానని సౌరవ్ గంగూలీ కామెంట్ చేయడం, అలాంటిదేమీ లేదని టీమిండియా టెస్టు కెప్టెన్ చెప్పడం రాద్ధాంతాన్ని రేపినట్టైంది...

విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ ఆడడం లేదని, రోహిత్ శర్మ టెస్టు సిరీస్ ఆడకపోవడంతో ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి పెరిగిందనే వార్తలు కూడా షికార్లు చేశాయి. తమ మధ్య అలాంటిదేమీ లేదని విరాట్ కోహ్లీ స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది..

విరాట్ కోహ్లీని కావాలని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని ఆయన అభిమానులు, బీసీసీఐలో రాజకీయాలు చేస్తున్న అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాలను బోర్డు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు కోహ్లీ ఫ్యాన్స్...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎపిసోడ్ మొత్తంలో సౌరవ్ గంగూలీ, జై షాలే అసలైన విలన్స్ అంటూ వారి అభిమానులతో పాటు మాహీ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ట్రోల్స్ చేశారు..

అయితే ఇప్పుడు సౌరవ్ గంగూలీకి కూడా మద్దతు పెరుగుతోంది. టీమిండియా కోసం ఎన్నో చేసిన గంగూలీకి, భారత జట్టు బాగు కోసం ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని చెబుతూ #NationStandswithDada హ్యా‌ష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు దాదా ఫ్యాన్స్..

మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో భారత జట్టు ఇరుక్కున్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుని, టీమ్‌ను సక్రమ మార్గంలో నడిపించిన గంగూలీ, ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగానూ టీమిండియా బాగు కోసం ఏం చేయాలో బాగా తెలుసని అంటున్నారు దాదా ఫ్యాన్స్...

గత రెండేళ్లల్లో కేవలం 24.64 సగటుతో పరుగులు చేస్తున్న విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ భారం పడుతున్న విషయాన్ని ఆయన అభిమానులు గుర్తించలేకపోయారని, గంగూలీ ఆ విషయాన్ని గ్రహించే కెప్టెన్సీ నుంచి తప్పించాడని అంటున్నారు...

కుమార సంగర్కర, షోయబ్ అక్తర్, స్టీవ్ వా, వకార్ యూనిస్ వంటి విదేశీ క్రికెటర్లు కూడా సౌరవ్ గంగూలీ కెప్టెన్సీని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారు...


భారత జట్టు తరుపున ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా 18,575 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ, టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా ఉన్నాడు...

పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగాలని కోరుకోవడం మూర్ఖత్వమేనంటూ ఆయన అభిమానులపై ఎదురుదాడి చేస్తున్నారు.. 

click me!