అతని వల్లే రవిచంద్రన్ అశ్విన్‌కి ఈ లక్కీ ఛాన్స్... టీ20 వరల్డ్‌కప్‌ 2021కి భారత జట్టు ఎంపికలో...

First Published Sep 11, 2021, 1:17 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అందరనీ ఆశ్చర్యానికి గురి చేసిన పేరు రవిచంద్రన్ అశ్విన్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌ని కాదని, నాలుగేళ్ల క్రితం వన్డే, టీ20లకు దూరమైన అశ్విన్‌కి టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

ఐపీఎల్‌లో ప్రదర్శన వల్లే రవిచంద్రన్ అశ్విన్‌ని టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేశామని ప్రకటించింది బీసీసీఐ... 

అలాగే భారత స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా జట్టుకి అందుబాటులో లేకపోవడం కూడా రవిచంద్రన్ అశ్విన్‌కి కలిసి వచ్చింది...

అయితే అశ్విన్‌ ఎంపిక వెనక మరో క్రికెటర్ హస్తం కూడా ఉందట. అతనే టీమిండియా వైట్ బాల్ వైస్ కెప్టెన్, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ...

‘ఐపీఎల్‌లో అశ్విన్‌ చక్కగా రాణిస్తున్నాడని, అతన్ని ఎదుర్కోవడం కొన్నిసార్లు తనకి కూడా కష్టంగా ఉంటోందని...’ సెలక్టర్లతో చెప్పాడట రోహిత్ శర్మ...

వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో విరాట్ కోహ్లీ కూడా అశ్విన్ ఎంపికకు ఓటు వేశాడట. దీంతో అశ్విన్‌ను టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి ఎంపిక చేశారు టీమిండియా సెలక్టర్లు...

గత కొన్ని నెలలుగా యజ్వేంద్ర చాహాల్ పర్ఫామెన్స్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం, పరుగులను నియంత్రించడంలో ప్రావీణ్యం కలిగిన ఈ ఆర్‌సీబీ స్పిన్నర్... ధారాళంగా పరుగులు ఇస్తుండడం కూడా అతన్ని తప్పించడానికి కారణమైందని సమాచారం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు తరుపున ఆడే వారిలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నుంచి ఆరుగురు ప్లేయర్లు ఎంపికైన విషయం తెలిసిందే...

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముగ్గురు, పంజాబ్ కింగ్స్ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఎంపిక కాగా... సన్‌రైజర్స్, ఆర్‌సీబీ, కేకేఆర్, సీఎస్‌కే నుంచి ఒక్కో ప్లేయర్ ఎంపికయ్యారు...

రాజస్థాన్ రాయల్స్ నుంచి ఒక్క ప్లేయర్ కూడా టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి ఎంపిక కాకపోవడం విశేషం. ఎమ్మెస్ ధోనీ, ఈ టోర్నీకి మెంటర్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

click me!