టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు 8 వార్మప్ మ్యాచులు... పూర్తి షెడ్యూల్ ఇదే...

First Published Sep 18, 2021, 1:41 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలైంది... యూఏఈ, ఓమన్ వేదికగా జరిగే ఏడో టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ప్రిపరేషన్స్‌లో భాగంగా 8 వార్మప్‌ మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఐసీసీ... వాటి పూర్తి షెడ్యూల్ ఇదే..

అక్టోబర్ 18న అబుదాబీ వేదికగా ఆఫ్ఘానిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మధ్యాహ్నం 3:30 నిమిషాలకు తొలి వార్మప్ మ్యాచ్ జరుగుతుంది... ఇదే వేదికపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య సాయంత్రం 7:30గంటలకు రెండో వార్మప్ మ్యాచ్ ఉంటుంది...

అక్టోబర్ 18 తేదీనే దుబాయ్ వేదికగా పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు వార్మప్ మ్యాచ్ ఉంటుంది. దీని తర్వాత ఇదే వేదికపై సాయంత్రం 7:30 గంటలకు ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో వార్మప్ మ్యాచ్ జరుగుతుంది...

అక్టోబర్ 20వ తేదీని అబుదాబీ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఇదే వేదికపై సాయంత్రం 7:30 గంటలకు సౌతాఫ్రికా, పాకిస్తాన్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది...

ఇదే రోజున దుబాయ్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు వార్మప్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ తర్వాత ఇక్కడే ఆఫ్ఘానిస్తాన్, వెస్టిండీస్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతుంది...

ఇండియా వార్మప్ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌ ప్రత్యేక్ష ప్రసారం చేయనుంది. ఆస్ట్రేలియాలో ఫాక్స్ క్రికెట్ ఛానెల్ మాత్రం అన్ని వార్మప్ మ్యాచులకు ప్రత్యేక్ష ప్రసారం చేస్తుంది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భాగంగా అక్టోబర్ 24న తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడనుంది భారత జట్టు. ఆ తర్వాత 31న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది...

నవంబర్ 3న ఆఫ్ఘానిస్తాన్‌తో మ్యాచ్ ఆడి... మిగిలిన రెండు మ్యాచులను గ్రూప్ స్టేజ్ వచ్చే జట్లతో నవంబర్ 5న, 8న తలబడుతుంది...

గ్రూప్ 2లో ఉన్న టీమిండియా గ్రూప్ 1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో వార్మప్ మ్యాచులు ఆడనుంది. టీమిండియా సెమీస్ చేరి, వీటిలో ఏ జట్టు అయినా సెమీస్‌కి అర్హత సాధిస్తే... మళ్లీ ఈ జట్ల మధ్య మ్యాచ్ చూసే అవకాశం దొరుకుతుంది...

click me!