నా కొడుకుని క్రికెటర్‌ మాత్రం కానివ్వను! యువరాజ్ సింగ్ కామెంట్స్...

First Published | Nov 10, 2023, 6:16 PM IST

2011 వన్డే వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మ్యాచులు ఆడాడు. 
 

తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడిన యువరాజ్ సింగ్, 13 వేల పైగా అంతర్జాతీయ పరుగులు చేశాడు.. 

శుబ్‌మన్ గిల్, అభిషేక్ నాయర్ వంటి కుర్రాళ్లకు మెంటర్‌గా కూడా వ్యవహరిస్తున్న యువరాజ్ సింగ్, తన కొడుకు కెరీర్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు..

Latest Videos


‘నాకైతే నా కొడుకు క్రికెటర్ కావడం ఏ మాత్రం ఇష్టం లేదు. అతన్ని క్రికెటర్ మాత్రం కానివ్వను. ఎందుకంటే క్రికెట్‌లో ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది. 

మరీ క్రికెటర్ల పిల్లల మీద ఈ ప్రెషర్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్‌తో పోల్చి చూస్తూ మీడియా, జనాలు వారిని విపరీతమైన ఒత్తిడిలో తోసేస్తున్నారు..
 

Yuvraj Singh

అందుకే నా కొడుక్కి అలాంటి పరిస్థితి రాకూడదని అనుకుంటున్నా. నేను గోల్ఫ్ ఆటను చాలా ఎంజాయ్ చేస్తున్నా. మా వాడికి కూడా ఓ ప్లాస్టిక్ గోల్ఫ్ సెట్ కొనిచ్చా. ఇప్పటికే కొన్ని షాట్స్ కూడా నేర్పించాను..

వాడు ఇంకా చాలా చిన్న పిల్లాడు. కొద్దికొద్దిగా ఆడుకోవడం నేర్చుకుంటున్నాడు. ఓ రోజు, వాడు వాళ్ల పిన్ని వాళ్ల ఇంటికి వెళ్లాడు. అక్కడ గోల్ఫ్ స్టిక్ కాకుండా క్రికెట్ బ్యాటు పట్టుకున్నాడు. దాంతో అటు ఇటూ పరుగెత్తి ఆడుకున్నాడు..

కొన్ని విషయాలను మనం ఎంత దూరం చేసినా, వారిలో ఆ జీన్స్ ఉంటుంది. దాన్ని తప్పించలేం. జీన్స్‌లో ఉన్న దాన్ని తప్పించడం కష్టం కూడా.. 

ఒకవేళ వాడు పెద్దయ్యాక క్రికెటర్ కావాలని డిసైడ్ అయితే, నేను ఇంకో దారి లేక సచ్చినట్టు సపోర్ట్ చేస్తా. అయితే కొన్ని సార్లు టెర్మినేటర్ 4గా కూడా మారుతా... ’ అంటూ నవ్వేశాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. 

click me!