సెంచరీ ముంగిట రోహిత్ శర్మ అవుట్... సంజయ్ మంజ్రేకర్‌ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

First Published Aug 12, 2021, 8:51 PM IST

విదేశాల్లో తొలి టెస్టు సెంచరీ అందుకోవాలనే రోహిత్ శర్మ కోరిక... తీరడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో రోహిత్ శర్మ సెంచరీ ముంగిట అవుటై... పెవిలియన్ చేరాడు. అయితే రోహిత్ శర్మ అవుటైన తర్వాత మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ సంజయ్ మంజ్రేకర్‌పై ట్రోల్స్ వస్తుండడం విశేషం. 

Rohit Sharma Out

Rohit Sharma Out

145 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 83 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు... తొలి వికెట్‌కి కెఎల్ రాహుల్‌తో కలిసి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ...

2002లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో సిక్సర్ బాదిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ... లార్డ్స్‌లో ఇంతకుముందు కపిల్‌దేవ్, సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా, అజింకా రహానే టెస్టుల్లో సిక్స్ బాదారు...

టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన రెండో భారత జోడిగా నిలిచారు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ. ఇంతకుముందు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే మూడు ఫార్మాట్లలో తొలి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు...

83 పరుగుల వద్ద అవుటై సెంచరీ‌ని కోల్పోయిన రోహిత్ శర్మ అవుటైన తర్వాత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌ను ట్రోల్ చేయడం మొదలెట్టారు ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్...

దీనికి కారణం రోహిత్ సెంచరీకి చేరువైన సమయంలో కామెంటేటర్‌గా ఉన్న సంజయ్ మంజ్రేకర్, అతన్ని పొడుగుతూ మాట్లాడడం మొదలెట్టాడు. సంజయ్, రోహిత్ సెంచరీ చేస్తాడని చెప్పాడని, హిట్ మ్యాన్ బౌల్ట్ అయ్యాడు...

దీంతో కామెంటేటర్ కర్స్ కారణంగానే సంజయ్ మంజ్రేకర్, రోహిత్ శర్మను కావాలని అవుట్ అయ్యేలా చేశాడని ట్వీట్లు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు...

సంజయ్ మంజ్రేకర్ విషయం పక్కనబెడితే సెంచరీకి చేరువైన తర్వాత చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ. 119 బంతుల్లో 81 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత 26 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

లార్డ్స్ టెస్టులో భారత ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసుకోవడం ఇదే తొలిసారి. 
రోహిత్ శర్మ అవుటైన తర్వాత 23 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా కూడా అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

150 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. మరో ఎండ్‌లో కెఎల్ రాహుల్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులతో క్రీజులో ఉన్నాడు కెఎల్ రాహుల్...

click me!