మిగిలిన బౌలర్లు పచ్చళ్లు అమ్మడానికి వచ్చారా... పాక్ బౌలింగ్‌పై డానిష్ కనేరియా ఫైర్...

First Published Dec 7, 2022, 3:05 PM IST

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన మొదటి టెస్టులో 74 పరుగుల తేడాతో ఓడింది పాకిస్తాన్... 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డ మీద అడుగుపెట్టిన ఇంగ్లాండ్, ఘన విజయంతో టూర్‌ని ప్రారంభించింది. బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లు 20 వికెట్లు తీస్తే... స్వదేశంలో పాక్ బౌలర్ల నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ రాలేదు...

England Win

‘ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టు ఓడిన తర్వాత మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో అందరికీ తెలుసు. ఇంగ్లాండ్ బాగా ఆడింది, వాళ్ల నుంచి నేర్చుకుంటాం. తప్పులను సరిదిద్దుకుంటాం... అని చెబుతారు. అయితే చేతల్లో మాత్రం అది కనిపించదు...

Pakistan vs England

చాలా ఏళ్లుగా ఇదే చెబుతున్నారు. కానీ నేర్చుకోవడం మనకి చేతకాదు. షాహీన్ ఆఫ్రిదీ ఉండి ఉంటే... గెలిచేవాళ్లమని అంటారు. అవును, అతను అందుబాటులో లేడు. మరి మిగిలిన బౌలర్లు ఏం చేస్తున్నారు. వాళ్లు పచ్చళ్లు అమ్ముకోవడానికి టీమ్‌లోకి వచ్చారా...

ఇంగ్లాండ్ జట్టు పక్కా ప్లానింగ్‌తో గెలవడానికి ఏం చేయాలో బాగా తెలుసుకుని వచ్చింది. అనుకున్నది అనుకున్నట్టుగా చేసి గెలిచింది. కానీ పాక్‌ అలా కాదు. ఓడిపోతామనే భయంతో ఇలాంటి చెత్త పిచ్ తయారుచేశారు. సొంత పిచ్‌పై వికెట్లు తీయలేకపోయారు...

ఓ ప్లానింగ్ లేదు, ఓ స్ట్రాటెజీ లేదు. ఏ టైమ్‌లో ఏ బౌలర్‌ని వాడాలో తెలీదు. రివర్స్ స్వింగ్ బౌలర్లు ఏరి? పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి మళ్లీ ప్రాణం వచ్చిందనే విషయం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఎన్ని రోజులని ఈ మాటలు చెబుతూ ఆటను పక్కనబెడతారు...

బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత బాబర్ ఆజమ్ షాక్ తగిలినట్టు చూస్తూ ఉండిపోయాడు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. బెన్ స్టోక్స్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఎంతో నేర్చుకోవాలి. బ్రెండన్ మెక్‌కల్లమ్ జట్టును నడుపుతున్న విధానం నుంచి మన కోచ్‌లు చాలా తెలుసుకోవాలి...

Ben Stokes

మన మేనేజ్‌మెంట్‌కి భయం ఎక్కువ. అందుకే ఇలాంటి చెత్త పిచ్‌లు తయారుచేశారు. పిచ్‌ బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తున్నప్పుడు ఏ బ్యాటర్ అయినా సెంచరీలు కొడతారు. మనవాళ్లు బాగా ఆడారని భుజాలు చరుచుకుంటున్నారు. మనం నెం.1 టీమ్‌గా ఉన్నామా?

మన దేశ క్రికెట్ ఎటువైపు వెళ్తుందో కూడా వాళ్లకి అర్థం కావడం లేదు. పాక్‌లో నిర్వహించకపోతే ఆసియా కప్ 2023 ఆడబోమని రమీజ్ రాజా చెప్పాడు. మనం లేకపోతే ఆసియా కప్ ఆగిపోతుందా? వరల్డ్ కప్‌ని జనాలు చూడడం మానేస్తారా... ఇలాంటి పిచ్‌లు తయారుచేస్తే, ఎవరు మాత్రం పాక్‌లో ఆడడానికి ఇష్టపడతారు...’ అంటూ ఫైర్ అయ్యాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా... 

click me!