రోహిత్ ఏమన్నా తోపా? సెంచరీ చేయకపోతే విరాట్‌లాగే అతన్ని కూడా... - గౌతమ్ గంభీర్

First Published Jan 16, 2023, 6:42 PM IST

అవకాశం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీని తిట్టడానికి, విమర్శించడానికి సిద్ధంగా ఉంటాడు గౌతమ్ గంభీర్. విరాట్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఎవ్వరైనా ట్రోల్ చేస్తారంటే అది గౌతీయే. అదే గంభీర్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసినా కూడా ఆహో! ఓహో.. అని పొగిడేస్తాడు...

Image credit: Getty

ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవైంది. ఆ గొడవని ఇప్పటికీ మరిచిపోని గౌతమ్ గంభీర్, అవకాశం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. తొలి వన్డేలో సెంచరీని తేలిగ్గా తీసేసిన గంభీర్, రెండో వన్డేలో కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అవ్వడాన్ని తీవ్రంగా విమర్శించాడు...

Image credit: PTI


మూడో వన్డేలో భారీ సెంచరీతో దుమ్మురేపాడు విరాట్ కోహ్లీ... 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు విరాట్ కోహ్లీ. సెంచరీ తర్వాత టీ20 రేంజ్‌లో గేరు మార్చి బౌండరీల మోత మోగించాడు విరాట్ కోహ్లీ. ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

మొదటి ఓవర్‌లో పరుగులే చేయలేకపోయిన రోహిత్ శర్మ, మూడు ఓవర్ల తర్వాత బ్యాటుకి పని చెప్పాడు. 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి కరుణరత్నే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ అయ్యాక ఇప్పటిదాకా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు రోహిత్ శర్మ...

Virat Kohli-Rohit Sharma

‘విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోవడం ఎంత చర్చ జరిగిందో రోహిత్ శర్మ సెంచరీ గురించి అంత చర్చ జరగాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 ఇన్నింగ్స్‌ల రోహిత్ శర్మ సెంచరీ అందుకోలేకపోయాడు. ఇన్ని ఇన్నింగ్స్‌లుగా సెంచరీ చేయకపోవడం మామూలు విషయం కాదు...

rohit sharma

ఒకటి, రెండు మహా మూడు సిరీసుల్లో సెంచరీ చేయలేకపోయాడంటే అనుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నుంచి రోహిత్ శర్మ సెంచరీ అందుకోలేకపోతున్నాడు.ఇంతకుముందు భారీ సెంచరీలు చేసేవాడు, ఇప్పుడు ఫామ్‌లో ఉన్నా సెంచరీలు చేయలేకపోతున్నాడు...

Rohit Sharma

అతను బాగా బాల్‌ని హిట్ చేస్తున్నాడు. అయితే మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. రోహిత్ శర్మ, వరల్డ్ కప్‌లోపు ఫామ్‌లోకి రావాలి.. ఈ ఇద్దరూ వరల్డ్ కప్‌ గెలవడానికి చాలా కీలకం...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. 

click me!