రోహిత్ శర్మ గొప్ప ప్లేయరే! కానీ టీమ్‌కి అవసరమైనప్పుడు అస్సలు ఆడడు.. పాక్ మాజీ కామెంట్స్..

Published : Aug 05, 2023, 11:51 AM IST

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే పెద్ద విషయం. అలాంటిది ఒకటికి మూడు డబుల్ సెంచరీలు బాదాడు రోహిత్ శర్మ. టీ20ల్లో నాలుగు సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. అయితే కీలక మ్యాచుల్లో రోహిత్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఎప్పుడూ రాలేదు..  

PREV
18
రోహిత్ శర్మ గొప్ప ప్లేయరే! కానీ టీమ్‌కి అవసరమైనప్పుడు అస్సలు ఆడడు.. పాక్ మాజీ కామెంట్స్..

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఐదు సెంచరీలతో రికార్డుల ఊచకోత కోసిన రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 1 పరుగుకే అవుట్ అయ్యాడు..

28

2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన రోహిత్ శర్మ, 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు..

38

ఆసియా కప్ 2022 టోర్నీలోనూ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2021, 2023లోనూ రోహిత్ శర్మ బ్యాటు నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు. ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు రోహిత్ శర్మపై సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్..

48

‘రోహిత్ శర్మ చాలా పెద్ద ప్లేయర్, నేను ఒప్పుకుంటా. అతను ఎన్నో రికార్డులు సాధించాడు, ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నాడు. అయితే కొందరు ప్లేయర్లు ఒత్తిడిని అస్సలు ఫేస్ చేయలేరు...

58

అందుకే నాకౌట్ మ్యాచుల్లో రోహిత్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి గెలిపించినట్టు నాకైతే గుర్తు లేదు. జట్టుకి అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఎప్పుడూ బాగా ఆడింది లేదు..
 

68

విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు ఉన్న తేడా అదే. సాధారణ మ్యాచుల్లో బాగా ఆడితే మంచి ప్లేయర్ అని మాత్రమే అంటారు, టీమ్‌కి ఎప్పుడు అవసరమో అప్పుడు బాగా ఆడితేనే గొప్ప ప్లేయర్ అవుతారు... రిటైర్ అయ్యేలోపు రోహిత్ అలాంటి ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడితే చూడాలని ఉంది..’  అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్..

78
Image credit: PTI

2011 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. 2014 టీ20 వరల్డ్ కప్ నుంచి రోహిత్ శర్మ, ఐసీసీ టోర్నీల్లో ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2014 ఫైనల్‌లో 29 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
 

88
Rohit Sharma

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో 28 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ.

Read more Photos on
click me!

Recommended Stories