కెరీర్ ఉండాలంటే దానికి రిటైర్మెంట్ ఇచ్చేయ్... జస్ప్రిత్ బుమ్రాకి గ్లెన్ మెక్‌గ్రాత్ సలహా..

Published : Aug 05, 2023, 11:23 AM IST

కొన్నేళ్లుగా టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఉంటున్నాడు జస్ప్రిత్ బుమ్రా. అయితే గత ఏడాది ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, ఏడాది పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు. ఐర్లాండ్‌ టూర్‌తో రీఎంట్రీ ఇస్తున్న బుమ్రాకి ఓ విలువైన సలహా ఇచ్చాడు గ్లెన్ మెక్‌గ్రాత్..  

PREV
16
కెరీర్ ఉండాలంటే దానికి రిటైర్మెంట్ ఇచ్చేయ్... జస్ప్రిత్ బుమ్రాకి గ్లెన్ మెక్‌గ్రాత్ సలహా..

ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన తర్వాత నెల రోజులకు బుమ్రా, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రెండు మ్యాచులకే గాయం తిరగబెట్టడంతో మళ్లీ క్రికెట్‌కి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది..

26
Jasprit Bumrah

‘జస్ప్రిత్ బుమ్రా, టీమిండియాకి ప్రధాన వనరు. అతని గణాంకాలు, అతను తీసుకున్న వికెట్లు, బుమ్రా బౌలింగ్ చేసే విధానికి నేను చాలా పెద్ద అభిమానిని. అయితే అతని బౌలింగ్ యాక్షన్, తన శరీరంపైన తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది..

36

జస్ప్రిత్ బుమ్రా సుదీర్ఘ కెరీర్‌ కొనసాగించాలంటే అతను ఫిట్‌గా, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇప్పుడున్న అంతర్జాతీయ షెడ్యూల్, ఐపీఎల్‌ వల్ల ఫాస్ట్ బౌలర్లు గాయపడడం సర్వసాధారణంగా మారిపోయింది. జస్ప్రిత్ బుమ్రాలాంటి బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్ అయితే ఇంకా ఎక్కువగా గాయపడే ఛాన్స్ ఉంటుంది..

46

కాబట్టి మూడు ఫార్మాట్లలో ఏదో ఒక ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల అతను సుదీర్ఘ కాలం క్రికెట్‌ కెరీర్‌ని కొనసాగించొచ్చు. ఎందుకంటే మూడు ఫార్మాట్లు ఆడుతూ, ఐపీఎల్ ఆడడం అంటే శరీరం మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది..

56

బుమ్రా బౌలింగ్ యాక్షన్ కారణంగా అతని వెన్నెముకపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, వాల్ష్ వంటి బౌలర్లు సుదీర్ఘ కాలం కెరీర్‌ని కొనసాగించారు. వారికి తమ శరీరాన్ని ఎలా మెయింటైన్ చేయాలో బాగా తెలుసు..

66
Jasprit Bumrah


వీళ్లంతా ఒక టైమ్ దాటిన తర్వాత టెస్టు ఫార్మాట్‌పైన మాత్రమే ఫోకస్ పెట్టారు. అందుకే అన్ని సంవత్సరాలు ఆడగలిగారు. నా బౌలింగ్ యాక్షన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. శరీరంపై ఒత్తిడి పడకుండా చూసుకునేవాడిని... గాయమైనా చాలా త్వరగా కోలుకునేవాడిని...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్.. 

click me!

Recommended Stories