టీమిండియాకి అంత సీన్ లేదు! పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్ 2023 గెలుస్తుంది... గ్లెన్ మెక్‌గ్రాత్ కామెంట్స్..

Published : Aug 05, 2023, 10:57 AM IST

12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతోంది టీమిండియా. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీమిండియా, ఆ తర్వాత 2015, 2019 ప్రపంచ కప్ టోర్నీల్లో సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది..

PREV
18
టీమిండియాకి అంత సీన్ లేదు! పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్ 2023 గెలుస్తుంది... గ్లెన్ మెక్‌గ్రాత్ కామెంట్స్..

అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే మెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసింది ఐసీసీ. అయితే దసరా నవరాత్రుల కారణంగా ఒకటి రెండు మ్యాచుల తేదీల్లో మార్పులు ఉండవచ్చని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించాడు..
 

28
India vs Pakistan

‘ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ కాబట్టి, వాళ్లకు కచ్ఛితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఐపీఎల్ కారణంగా ఇప్పుడు ఇండియాలో ఆడేందుకు ఏ జట్లూ పెద్దగా భయపడడం లేదు. వాళ్లకు భారత పిచ్‌లపై పూర్తి అవగాహన వచ్చింది..

38
england

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్‌లో బాగా ఆడుతున్నారు. ఈ అనుభవం వారికి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కచ్ఛితంగా ఉపయోగపడుతుంది. అందుకే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ టైటిల్ ఫెవరెట్స్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కచ్ఛితంగా ఉంటాయి..

48
India vs Pakistan Last Over

అన్నింటికీ మించి పాకిస్తాన్‌, ఈసారి వన్డే వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ల బ్యాటింగ్ లైనప్, ఫాస్ట్ బౌలింగ్‌ యూనిట్ అద్భుతంగా ఉంది.

58

నన్ను అడిగితే ఇండియా కంటే పాకిస్తాన్‌కే విజయావకాశాలు ఎక్కువ... పాకిస్తాన్, ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్.. ఇవి నా దృష్టిలో వన్డే వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్స్.

68
Arshdeep Singh

ఇండియాలో ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహకారం లభించకపోవచ్చు. ఇక్కడి పిచ్‌లు ప్రత్యేకంగా స్పిన్నర్ల కోసం రూపొందించబడినట్టు ఉంటాయి. అయితే టీమిండియా నుంచి చాలా మంది యంగ్ సీమ్ బౌలర్లు వస్తున్నారు...

78

ఇంతకుముందు టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌పై పెద్దగా ఫోకస్ పెట్టేది కాదు. ఇప్పుడు వారి ఆలోచన మారినట్టు ఉంది. ఇండియాలో ఫాస్ట్ బౌలర్‌గా సక్సెస్ అయితే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా వికెట్లు తీయొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్.. 

88

వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా ప్రదర్శన చూసిన తర్వాత చాలామంది భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా గ్లెన్ మెక్‌గ్రాత్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. టీమిండియా కంటే పాకిస్తాన్ జట్టు, టీమ్ కాంబినేషన్‌ విషయంలో పూర్తి క్లారిటీతో బరిలో దిగుతున్నట్టు కనిపిస్తోంది.. 

click me!

Recommended Stories