భారత్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కూడా దీన్ని సాకుగా పెట్టుకుని, సానుభూతి పొందాలని ప్రయత్నించింది. అహ్మదాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫ్యాన్స్ చేసిన దానికి తామేం చేయలేమని, వారికి కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని తేల్చేసింది ఐసీసీ..
తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దీనిపై స్పందించాడు. ‘నేను ఓ సారి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాను. అప్పుడు నా పైకి రాళ్లు, ఐరన్ బోల్ట్‌లు విసిరారు. అందులో ఓ రాయి నా కళ్ల మధ్య తగిలింది. కంటికి తగిలి ఉంటే నా చూపు పోయి ఉండేది..
అయితే అభిమానులు చేసిన ఆ చిల్లర పనిని పట్టుకుని, మేం రచ్చ చేయాలని అనుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మాత్రం చెత్త పర్ఫామెన్స్ కారణంగా వస్తున్న ట్రోలింగ్ తప్పించుకునేందుకు అహ్మదాబాద్ ఫ్యాన్స్ చేసిన చిన్న పనిని పెద్దది చేయాలని చూస్తోంది..’ అంటూ వ్యాఖ్యానించాడు ఇర్ఫాన్ పఠాన్..
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా దీనిపై ఘాటుగా స్పందించాడు. ‘పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ జైనబ్ అబ్బాస్ ఇండియా గురించి, హిందువుల గురించి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే తప్పులేదు..
ఐసీసీ ఈవెంట్‌లో పాకిస్తాన్ పాటలు వేయలేదని మిక్కీ ఆథర్, దీన్ని బీసీసీఐ ఈవెంట్ అంటే తప్పులేదు? ప్లే గ్రౌండ్‌లో, భారతీయుల మధ్య మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేస్తే తప్పులేదు.. ఎదుటివారిలోనే తప్పులు వెతకాలని చూడకండి?’ అంటూ ట్వీట్లు చేశాడు డానిష్ కనేరియా...
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి తర్వాత భారత జట్టుపై పాక్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మహ్మద్ షమీ, ఓ పాక్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అయితే మిగిలిన టీమ్ ప్లేయర్లు, ఓటమి బాధతో డ్రెస్సింగ్ రూమ్‌కి సైలెంట్‌గా వెళ్లారే తప్ప, జనాల ప్రవర్తనను పెద్దది చూసి సానుభూతి పొందాలని చూడలేదు..