రోహిత్ శర్మ చాలా స్మార్ట్, విరాట్ కోహ్లీతో పోలిస్తే... టీమిండియా నయా కెప్టెన్‌పై టెండూల్కర్ కామెంట్స్...

Published : Dec 05, 2021, 03:57 PM IST

ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన క్రికెటర్లు కొందరైతే, ఐపీఎల్ కారణంగా భారత జట్టు కెప్టెన్సీ దక్కించుకున్నవాడు రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్‌, టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే...

PREV
18
రోహిత్ శర్మ చాలా స్మార్ట్, విరాట్ కోహ్లీతో పోలిస్తే... టీమిండియా నయా కెప్టెన్‌పై టెండూల్కర్ కామెంట్స్...

2013లో రికీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రోహిత్ శర్మ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది...

28

8 సీజన్లలో ఐదు సార్లు టైటిల్ గెలిచి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు...

38

‘రోహిత్ శర్మతో ఏం మాట్లాడినా, అతని దగ్గర చాలా సమాచారం ఉంటుంది. అతనికి చాలా స్మార్ట్ క్రికెట్ బ్రెయిన్ ఉంది. ఎలాంటి సందర్భాల్లోనూ రోహిత్, ఒత్తిడికి గురి కావడం చూడలేదు...

48

 చాలా కూల్‌గా ఒత్తిడిని గ్రహిస్తాడు. కెప్టెన్‌‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం అదే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో జట్టులో ఏదో ఓ కొత్త జోష్ కనిపిస్తుంది... అందుకే ఐదు సార్లు టైటిల్ గెలవగలిగాడు...

58

ఓ కెప్టెన్ అనేవాడు, అనేక విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. టీమ్‌కి ఎలాంటి కెప్టెన్ కావాలో తెలుసుకుని, పరిస్థితులకు తగ్గట్టుగా అలా మారే నాయకుడు కావాలి...

68

అన్నింటికీ మించి ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూల్‌గా ఉంటూ, ఆటగాళ్లను, బౌలర్లను ప్రోత్సహించే తత్వం కెప్టెన్‌కి ఉండాలి... ఇవన్నీ రోహిత్‌లో ఉన్నాయి...

78

రోహిత్‌ శర్మతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఒత్తిడిని ఫేస్ చేయలేడు. కాస్త ప్రెషర్‌ ఫీలవుతాడు... అయితే రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ క్లిష్ట పరిస్థితుల్లో ప్రెషర్‌ను చక్కగా ఫేస్ చేసి, బ్యాటింగ్ చేయగలడు...’ అంటూ కామెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్...

88

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే..

Read more Photos on
click me!

Recommended Stories