అలా అయితే అజింకా రహానే కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమే, శ్రేయాస్ అయ్యర్‌తో... జహీర్ ఖాన్ కామెంట్స్...

First Published Dec 5, 2021, 1:19 PM IST

కాన్పూర్ టెస్టులో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన అజింకా రహానే, గాయం కారణంగా ముంబై టెస్టుకి దూరమైన విషయం తెలిసిందే. ఫిట్‌గా ఉన్నా, పేలవ ఫామ్‌తో వరుసగా విఫలమవుతున్న రహానేని తప్పించాలంటూ విమర్శలు వచ్చాయి...

రెండో టెస్టు ఆరంభానికి ముందు ఏకంగా ముగ్గురు ప్లేయర్లు గాయపడ్డారని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది...

విరాట్ కోహ్లీ గైర్హజరీలో ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి... మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న రహానే, ఆ తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

‘నిజంగా రహానేకి గాయమైతే మంచిది. అలాగయితే రహానేని జట్టు నుంచి తప్పించనట్టే అవుతుంది. అయితే ఫిట్‌గా ఉండి కూడా, గాయం వంకతో పక్కనబెట్టి ఉంటే.. మాత్రం రహానే కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమే..

ప్రస్తుతం టీమిండియాలో పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను ఏదో వంక చెప్పి పక్కనబెట్టలేరు..

అలాగే దేశవాళీ క్రికెట్‌లో కూడా చాలా మంది ప్లేయర్లు, భారత జట్టులో ప్లేస్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా రిజర్వు బెంచ్‌ని గమనిస్తే, ఎంత మంది ప్లేయర్లు టీమ్‌లో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది...

ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న ఎందరో ప్లేయర్లు, ఇప్పుడు రహానేకి పోటీ ఇస్తున్నారు. టీమిండియాలో ఉన్న ప్లేయర్లు ఎవ్వరైనా జట్టులో కొనసాగాలంటే నిలకడైన ప్రదర్శన ఇవ్వాల్సిందే...

లేదంటే ఆ ప్లేస్‌ ఒక్కసారి కోల్పోతే, మళ్లీ ఆ చోటును దక్కించుకోవడం చాలా కష్టమైపోతుంది. రహానే స్థానంలో ఆడేందుకు శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ సిద్దంగా ఉన్నారు..

అలాగే ఓపెనింగ్ పొజిషన్‌కి పోటీ పెరగడంతో కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ కూడా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడొచ్చు. ఈ పరిణామాలు రహానేకి ఇబ్బంది కలిగిస్తాయి...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్...

2021 సీజన్‌లో కేవలం 19.57 సగటుతో 411 పరుగులు చేసిన అజింకా రహానే, 20 ఇన్నింగ్స్‌ల కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడి అతి తక్కువ యావరేజ్ కలిగిన భారత బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు...

అజింకా రహానేకి ఆఖరి అవకాశంగా సౌతాఫ్రికా టూర్‌లో చోటు దక్కుతుందని, అయితే అతనికి తుది జట్టులో చోటు దక్కడం మాత్రం అనుమానమే అని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!