రోహిత్, నీకెందుకింత తుత్తర... టెస్టు కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే...

Published : Mar 04, 2022, 11:30 AM IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు ఆడుతున్న మ్యాచ్ ద్వారానే టెస్టు సారథిగా ఆరంగ్రేటం చేస్తున్నాడు రోహిత్ శర్మ. అయితే కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేని రోహిత్, టెస్టు కెప్టెన్‌గా తన తొలి ఇన్నింగ్స్‌లోనూ అదే తొందరపాటు చూపించి, పెవిలియన్ చేరాడు...

PREV
113
రోహిత్, నీకెందుకింత తుత్తర... టెస్టు కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే...

మూడు ఫార్మాట్లలోనూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఆరంగ్రేటం చేసి... టెస్టు, వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా మారి, కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న మొదటి ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

213

గత 60 ఏళ్లల్లో అతి పెద్ద వయసులో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రెండో భారత సారథిగా నిలిచాడు రోహిత్ శర్మ...

313

ఇంతకుముందు భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 37 ఏళ్ల 36 రోజుల వయసులో కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడగా, రోహిత్ శర్మ వయసు 34 ఏళ్ల 308 రోజులు...

413

టీమిండియాకి 35వ టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఆసియాలో అత్యంత ఎక్కువ మంది టెస్టు సారథులను మార్చిన జట్టుగా టాప్‌లో నిలిచింది టీమిండియా...

513

పాకిస్తాన్ 34 మంది టెస్టు కెప్టెన్లను మార్చగా, శ్రీలంక జట్టు టెస్టుల్లో 17 మంది కెప్టెన్లను మార్చింది. బంగ్లాదేశ్ 11 మంది టెస్టు సారథులను ఉపయోగించగా, ఆఫ్ఘనిస్తాన్‌కి ఇప్పటిదాకా ఇద్దరు టెస్టు కెప్టెన్లు మారారు...

613

కెప్టెన్‌గా ఆడే తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నుంచి భారీ స్కోరు వస్తుందని ఆశించారు టీమిండియా ఫ్యాన్స్... అయితే వారి కోరిక నెరవేరలేదు...

713

28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన రోహిత్ శర్మ, క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా బ్యాటింగ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు కనిపించాడు...

813

లహిరు కుమార బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన రోహిత్ శర్మ, అదే ఓవర్‌లో మరోసారి స్వీప్ షాట్‌కి ప్రయత్నించి లక్మల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

913

కెప్టెన్‌గా ఆడే తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసి, తనపై ఉన్న విమర్శలన్నింటికీ సమాధానం ఇస్తాడని భావించారు రోహిత్ ఫ్యాన్స్...

1013

అయితే విండీస్‌తో టీ20 సిరీస్, శ్రీలంకతో టీ20 సిరీస్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయిన రోహిత్ శర్మ, తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ పేలవ ఫామ్‌ను కొనసాగించాడు...

1113

మొదటి వికెట్‌కి మయాంక్ అగర్వాల్‌తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యం జోడించిన రోహిత్ శర్మ, టెస్టు మ్యాచ్‌ని కూడా వన్డేల్లా ఆడాలనే ఆలోచనతో వికెట్ పారేసుకోవడం విమర్శలకు తావిస్తోంది...

1213

రోహిత్ శర్మ తొందరపాటు కారణంగా 10 ఓవర్లలోపే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. రోహిత్ అవుటైన తర్వాత 49 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా పెవిలియన్ చేరాడు...

1313

లంక యంగ్ స్పిన్నర్ ఎంబుదెనియా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు మయాంక్ అగర్వాల్. 80 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

Read more Photos on
click me!

Recommended Stories