మూడో టెస్టులో రోహిత్ శర్మ ఎంట్రీ కన్ఫార్మ్... ఉమేశ్ స్థానంలో నటరాజన్...

First Published Dec 29, 2020, 12:29 PM IST

రెండో టెస్టులో అద్వితీయ విజయాన్ని అందుకున్న టీమిండియాకి మరో శుభవార్త. చివరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ శర్మ, బుధవారం జట్టుతో కలవనున్నాడు. సిడ్నీలో క్వారంటైన్ పీరియడ్ గడిపిన రోహిత్ శర్మ, డిసెంబర్ 30 నుంచి భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొంటాడు. రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో టి నటరాజన్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డిసెంబర్ 15న ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ శర్మ, బీసీసీఐ అధికారుల పర్యవేక్షణలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు...
undefined
అయితే మూడో టెస్టులో ఎవరి స్థానంలో రోహిత్ శర్మ ఎంట్రీ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది... హనుమ విహారి, మయాంక్ అగర్వాల్‌లలో ఒకరు రోహిత్ కోసం ప్లేస్ త్యాగం చేయాల్సి ఉంటుంది.
undefined
రెండు టెస్టుల్లోనూ ఫెయిల్ అయిన మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మను ఓపెనర్‌గా దించాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
సునీల్ గవాస్కర్ మాత్రం మయాంక్ అగర్వాల్ బదులుగా విహారిని జట్టు నుంచి తప్పించాలని చెప్పాడు. రోహిత్ శర్మ- మయాంక్ అగర్వాల్ కలిసి ఓపెనింగ్ చేయాలని, శుబ్‌మన్ గిల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని సూచించాడు సునీల్ గవాస్కర్
undefined
రెండో టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియడంతో డిసెంబర్ 30 నుంచి టీమిండియాతో కలవబోతున్నాడు రోహిత్ శర్మ... సిడ్నీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో మూడో టెస్టు వేదికపై ఇంకా క్లారిటీ రాలేదు.
undefined
అయితే కెఎల్ రాహుల్‌ని కూడా ఆడిస్తే టీమిండియా మరింత బలంగా తయారవుతుందని అంటున్నారు విశ్లేషకులు...
undefined
కెఎల్ రాహుల్‌కి కూడా అవకాశం ఇవ్వాలని టీమిండియా భావిస్తే... మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మ, హనుమ విహారి స్థానంలో కెఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉంది...
undefined
స్టాండ్ బై వేదికగా మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా... టీమిండియా ప్రాక్టీస్ కోసం ఇదే మైదానాన్ని అనుమతించే అవకాశం ఉంది..
undefined
రెండో ఇన్నింగ్స్‌లో మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్, గాయంతో నాలుగో ఓవర్‌ మధ్యలోనే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఉమేశ్ యాదవ్ గాయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
undefined
అయితే మూడో టెస్టులో ఉమేశ్ యాదవ్ బరిలో దిగడం అనుమానమే అని తెలుస్తోంది. అతని స్థానంలో మూడో వన్డే, టీ20 సిరీస్‌లో అదరగొట్టిన నటరాజన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది...
undefined
నటరాజన్‌కి బదులుగా ప్రాక్టీస్ మ్యాచుల్లో రాణించిన నవ్‌దీప్ సైనీకి చోటు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు...
undefined
మరోవైపు రెండో వన్డేలో గాయపడిన డేవిడ్ వార్నర్... మూడో టెస్టులో బరిలో దిగడం కూడా అనుమానమే అని తెలుస్తోంది. వార్నర్ ఫిట్‌నెస్‌పై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
undefined
click me!