రికార్డులు సృష్టిస్తూ, ఆస్ట్రేలియాను వణికిస్తూ... రెండో టెస్టుకే టీమిండియాలో ఎంత మార్పు...
First Published | Dec 29, 2020, 10:42 AM ISTమొదటి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు... తొలి టెస్టులో ఏకైక హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ కూడా లేడు. షమీ గాయం కారణంగా తప్పుకున్నాడు, రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ గాయంతో తప్పుకున్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అందుబాటులో లేడు, రోహిత్ శర్మ ఆడడం లేదు... ఇన్ని సమస్యలున్నా, స్టార్లు లేకున్నా... టాప్ టీమ్ ఆస్ట్రేలియాను వణికిస్తూ ఆస్ట్రేలియా టూర్‌లో తొలి టెస్టు విజయాన్ని అందుకుంది టీమిండియా.