అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ను అక్షర్ పటేల్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి తాంజిద్ హసన్ (25)ను అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. ఆ బంతి బ్యాట్ కు తగిలిన సౌండ్ కూడా అక్షర్ పటేల్ వినిపించలేదు. దీంతో అప్పీల్ కూడా చేయలేదు. కానీ, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అప్పీల్ చేయడంలో అంపైర్ కొద్ది సేపటికి ఔట్ ఇచ్చారు.
ఆ తర్వాత ఎంత స్పీడ్ గా వచ్చాడో అంతే వేగంగా క్రీజును వదిలాడు ముష్ఫికర్ రహీమ్. అద్భుతమైన బాల్ తో అక్షర్ పటేల్ రహీమ్ ను బోల్తా కొట్టించాడు. అతను కూడా కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో హ్యాట్రిక్ అకాశం వచ్చింది.
ఆ తర్వాత జాకర్ అలీ క్రీజులోకి వచ్చాడు. అక్షర్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్‌కు తగిలి స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లింది. సింపుల్ గా వచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ జారవిడిచాడు. దీంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ అయింది. రోహిత్ శర్మ సైతం క్యాచ్ మిస్ కావడంతో తన చేతిని గ్రౌండ్ పై కొడుతూ ఆగ్రహంగా కనిపించాడు. ఆ తర్వాత వెంటనే చేతులు జోడించి అతనికి క్షమాపణ చెప్పాడు. 22 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ మిస్ చేసిన క్యాచ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి